ఆధునికత ఎంతగా పెరుగుతున్నా అనాగరిక ఆచారాలను మరొక పక్క పెంచిపోషిస్తున్నారు. నాటువైద్యం శాస్త్రం కాదని ఎంతగా మొత్తుకుంటున్నా ఇంకా దానినే గుడ్డిగా ఆచరిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఈ కోవలోనే ఆంధ్రా -  కర్ణాటక సరిహద్దులోని రామసముద్రం మండలం పెద్ద కురప్పల్లి గ్రామంలో ఓ అనాగరిక సంఘటన వెలుగుచూసింది.


72 ఏళ్ల భారత స్వాతంత్ర కాలంలో కూడా ఇప్పటికీ దెయ్యాలు, భూతాలు అంటూ అనేక మంది భయపడుతుండటం శాస్త్ర సాంకేతికత అభివృద్ధికి పెనుసవాల్‌గా మారింది. అర్ధరాత్రలు సైతం ఏమి జరుగుతుందో పసిగట్టేందుకు క్లోజ్డ్‌ సర్క్యూట్‌ (సీసీ) కెమెరాల నిఘా అందుబాటులో ఉన్నప్పటికీ ఇంకా కనిపించని, ఊహాజనితమైన కల్పనలకే ప్రాధాన్యతలివ్వడంతో ఆ భయోందోళనలు గూడుకట్టుకుంటున్నాయి. 


ఈ నేప్యద్యంలోనే పెద్ద కురప్పల్లి గ్రామానికి చెందిన క్రిష్ణప్ప కూతురు మదనపల్లి లో పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థిని లావణ్య కు దెయ్యం పట్టిందని ఓ భూతవైద్యుడు విచక్షణారహితంగా చితక్కొట్టాడు. ఆ దెబ్బలకు తాళలేక ఆ విధ్యార్థిని సృహ కోల్పోయింది. ఇంతకీ ఆ భూతవైద్యుడు ఎవరని ఆరాతీస్తే కర్ణాటక సరిహద్దులో గల గూకుంట గ్రామంలో  జయప్ప అనే భూత వైద్యుడుగా తేలింది. అతడు భూతవైద్యం పేరుతో అనేక మోసాలకు పాల్పడుతున్నట్టు వెలుగులోకొచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: