సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. ఆయన పార్టీ మొత్తం 135 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తే ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. ఇక పవన్ అధ్యక్షుడిగా ఉంటూ రెండు సీట్లలో పోటీ చేస్తే రెండూ ఓడిపోయారు.   ఆ పరాభవం నుంచి ఇప్పటికీ ఆయన కోలుకున్నట్లుగా కనిపించడంలేదు. 


ఇదిలా ఉంటే ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ, పవన్ని ఆయన అన్న చిరంజీవి ఓడించాడంటూ సంచలన కామెంట్స్ చేశారు. పవన్, చిరంజీవి ఇద్దరూ సినిమాల్లో మంచి హీరోలే కానీ, రాజకీయాల్లో మాత్రం ఫెయిల్ అయ్యారని ఆయన అన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి వస్తే జనం ఓడించారని, పైగా ఆయన పార్టీని కాంగ్రెస్ లో కలిపేయడాన్ని జనం తప్పుపట్టారని  అన్నారు. ఆ ప్రభావం పవన్ మీద పడిందని, అందుకే జనసేనను కూడా ఓడించారని అన్నారు.


ఇక రెండు రోజులు జనంలో ఉంటూ, పది రోజులు ఇంట్లో పడుక్కుంటే నాయకుడు ఎలా అవుతాడని పవన్ని మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. నాయకుడు అన్న వాడు జనంలో తిరగాలని, ఎపుడూ వారికి అందుబాటులో ఉండాలని సూచించారు. ఇక తాము మధ్యం, మనీ పంపిణీ చేయలేదని ఏ నాయకుడైనా అంటే అది వట్టి మాటేనని కూడా మోత్కుపల్లి నర్సింహులు పవన్ కి చురకలు వేశారు.  అవన్నీ మాములు అయిపోయాయని కూడా చెప్పుకొచ్చారు. పవన్ ఇప్పటికైనా జనంలో ఉంటూ పనిచేస్తే వచ్చే ఎన్నికలకు కొంత అయినా పుంజుకునే అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: