చంద్రబాబుకు అతి పెద్ద మైనస్ ఏంటి అంటే కుమారుడు లోకేష్ నే చెబుతారు ఎవరైనా. బాబు రాజకీయ చతురత, లౌక్యం ఎక్కడా లోకేష్ కి రాలేదు, మంత్రిగా  రెండేళ్ళ పాటు ట్రైనింగ్ ఇచ్చినా కూడా రాజకీయం అబ్బలేదు. ఇక పార్టీ దారుణంగా ఓడిన తరువాత కొన్నాళ్ళు మౌనంగా ఉన్న లోకేష్ మహాశయుడు మళ్ళీ ట్విట్టర్ పిట్టతో కూత పెట్టిస్తున్నాడు.


 అయితే లోకేష్ చేస్తున్న కామెంట్స్ అన్నీ టీడీపీకి ఇపుడు ఇరకాటంలో పడేలా చేస్తున్నాయంటున్నారు. జగన్ని ఓ మాట అనబోయి నాలుగు మాటలు తనకూ, తండ్రికీ కూడా అంటించుకుంటున్నాడని తమ్ముళ్ళు గొల్లుమంటున్నారు. తాజా ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ సీట్లను గెలుచుకుని రికార్డ్ స్రుష్టించింది. వైసీపీ విజయం వెనక కోట్లాదిమంది ప్రజలు తీర్పు ఉంది. మరి ఇటువంటి లాండ్ స్లైడ్ విక్టరీ వచ్చినపుడు జనం మోజు ఏ స్థాయిలో  ఉందో అర్ధమవుతుంది. దాన్ని గమనించి జాగ్రత్తగా ప్రతిపక్షం మసలుకోవాలి.


 కొత్త ప్రభుత్వానికి కొంత వ్యవధి కూడా ఇవ్వాలి. అయితే ఇది మరచిపోయి తమ్ముళ్ళు ఓడిన రెండవ రోజు నుంచే విమర్శలు మొదలెట్టేశారు. అది వేరే సంగతి కానీ లోకేష్ మరింత డ్యామేజింగ్ కామెంట్స్ తో వైసెపీ టార్గెట్ చేయాలనుకుంటున్నారు. ఏ వన్, ఏ టూ అంటూ జగన్, విజయసాయిరెడ్డిలపై ట్విట్టర్లో లోకేష్ చేసిన కామెంట్స్ ప్రజా తీర్పుని తప్పుపట్టడమేనని మేధావులు సైతం అంటున్నారు. జగన్ మీద కోర్టులో కేసులున్న సంగతి  తెలిసిందే. అయితే అవి రుజువు కాలేదు, విచారణ జరుగుతోంది. అయినా సరే ఏ వన్, ఏ టూ అంటూ లోకేష్ అనడం ద్వారా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, తీర్పుని కూడా కించపరుస్తున్నారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: