గల్లా జయదేవ్ ఇపుడు హఠాత్తుగా టీడీపీలో కీల‌క స్థానానికి చేరుకున్నారు. గల్లా జయదేవ్ కుటుంబ నేపధ్యమే అందుకు కారణం. ఆయన తల్లి గల్లా అరుణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు వైఎస్సార్ ఆ కుటుంబానికి రాజకీయంగా ఎంతో వూతమిచ్చారు. ఇక విభజన తరువాత గల్లా అరుణ టీడీపీలో చేరడంతో కొడుకు జయదేవ్ రాజకీయ జీవితం ప్రారంభమైంది.


మొదటిసారి గుంటూరు ఎంపీగా 2014 ఎన్నికల్లో గెలిచిన గల్లా జయదేవ్ మిష్టర్ ప్రైం మినిస్టర్ అంటూ మోడీని పార్లమెంట్ లో పిలవడం ద్వారా జనంలో పాపులర్ అయ్యారు. ఇక ఆయన హవా నాటి నుంచి చంద్రబాబు దగ్గర  కొనసాగుతోంది. గల్లా అరుణకు పొలిటి బ్యూరోలో స్థానం. జయదేవ్ టీడీపీపీ నేత ఇలా కీలక బాధ్యతలు బాబు అప్పగించడం పట్ల మరో ఎంపీ కేశినేని నాని అలిగిన సంగతి తెలిసిందే.


ఇదిలా ఉండగా గల్లా తాజా ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతో గెలిచారు. వైసీపీ ఎంపీ అభ్యర్ధి మోదుగుల వేణుగోపాల్రెడ్డి మీద ఆయన గెలిచారు. అయితే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కబెట్టకుండా వదిలేయడం వల్లనే గల్లా గెలుపు సాధ్యమైందని అంటున్నారు. ఆ విషయం మీద కోర్టుకు వెళ్తానని మోదుగుల అప్పట్లో అన్నారు. ఇపుడు ఆ పని ఉద్యోగులు చేస్తున్నారు.  ఎన్వలప్‌ కవర్‌పై (ఫామ్‌-13బీ) సీరియల్‌ నంబరు లేదన్న కారణంగా తిరస్కరించిన తమ పోస్టల్‌ బ్యాలెట్లను తిరిగి పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ పలువురు ప్రభుత్వ ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్ వేశారు. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని 9,782 పోస్టల్‌ బ్యాలెట్లను ఎన్నికల కమిషన్‌ (ఈసీ) తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ వారు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 


హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై సోమవారం విచారణ జరిపింది. ఈ పిటిషన్‌ విచారణార్హత గురించి తెలియజేయడంతో పాటు ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. మరి ఈ ఓట్లను కనుక లెక్కించాలని కోర్ట్ ఆదేశిస్తే గల్లా ఓటమి ఖాయమని ఘంటాపధంగా  చెప్పవచ్చు. అదే జరిగితే టీడీపీకి మరో గట్టి షాక్ ఖాయమన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: