చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో కూడా బిజెపి వల విసిరింది. వీలైనంత మంది తెలుగుదేశంపార్టీ నేతలను పార్టీలోకి చేర్చుకోవటమే లక్ష్యంగా బిజెపి పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే మొదటగా సత్యవేడు మాజీ ఎంఎల్ఏ హేమలత బిజెపి గాలానికి చిక్కారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు.

 

మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం తర్వాత మాజీ ఎంఎల్ఏలు, ద్వితీయ శ్రేణి నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పార్టీ మారదలచుకున్న నేతలు మొదటి ప్రాధాన్యంగా వైసిపిని రెండో ప్రాధాన్యంగా మాత్రమే బిజెపిని ఎంచుకుంటున్నారు.  ఇతర పార్టీల నుండి వలసలకు గేట్లు తెరవటంపై జగన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి కొందరు బిజెపిలోకి వెళిపోతున్నారు.

 

మొన్నటి ఎన్నికల్లో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో  కుప్పంలో చంద్రబాబు తప్ప  ఇంకెవరూ గెలవలేదు. దాంతో చాలామంది నేతలు పార్టీ నుండి బయటకు వచ్చేసేందుకు రెడీ అయిపోయారు. ఇందులో భాగంగానే ముందుగా బిజెపిలోకి వలసలు మొదలయ్యాయి. హేమలతతో మొదలైన వలసలు ఎవరితో ఆగుతాయో చూడాల్సిందే.

 

  

 


మరింత సమాచారం తెలుసుకోండి: