చంద్రబాబు సారధ్యంలో టీడీపీ ఎందుకు ఓడిపోయిందో కారణాలు చెప్పమంటే జనాలు సుమారు 20 పైగానే కారణాలు చెబుతారు. కానీ బాబుగారికి మాత్రం కారణాలు కనిపించడం లేదు. ఇరవై నాలుగు గంటలూ రాష్ట్రాభివృద్ధికే శ్రమించా. కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి వచ్చి కూర్చోవడానికి స్థలం కూడా లేకపోయినా ప్రజలకు మంచి పరిపాలన అందించా. నీతిమంతంగా పాలించా..' అన్నారు చంద్రబాబు. ఈ డైలాగులు అన్నీ పాతవే. ఎన్నికల ముందు ఓటు అడగటగానికి వెళ్లినప్పడు చంద్రబాబు నాయుడు ఇవే డైలాగులు చెప్పారు. ఇప్పుడూ వాటినే వల్లె వేస్తూ ఉన్నారు.


ఎన్నికల ఫలితాలు వచ్చాకా తొలిసారి పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు. ఆ సందర్భంగా తమ పార్టీ కార్యకర్తల్లో స్థైర్యం నింపే మాటలు చెప్పారు. తను రాష్ట్రానికి ఎంతోమేలు చేసినట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఎంతో గొప్ప పాలనను అందించినట్టుగా చెప్పుకొచ్చారు.  అసలు ఎన్నికల్లో తనను ప్రజలు ఓడించలేదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.


ఇక ఎందుకు ఓడిపోయినట్టే ఇంకా అర్థంకాలేదని, అందుకు సంబంధించి సమీక్షలు జరుగుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. తనను మరోసారి గెలిపించినందుకు కుప్పం ప్రజలకు తను రుణపడి ఉన్నట్టుగా చంద్రబాబు ప్రకటించారు. తను తన కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ప్రజాసేవకు అంకితం అయినట్టుగా చెప్పుకొచ్చారు. ఇలాంటి డైలాగులే వేసినా ఎన్నికల సమయంలోనే జనాల చంద్రబాబు మీద కనికరం చూపలేదు. మళ్లీ వచ్చి ఆయన అవే డైలాగులే చెబుతూ ఉండటం గమనార్హం!

మరింత సమాచారం తెలుసుకోండి: