- 2 నెలల పసికందు స్కానింగ్‌లో అవినీతికి పరాకాష్ట
 
2 నెలల పసికందుపై వేలాది రూపాయలు దండుకోవటమే పరమావదిగా ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్లు , ఆసుపత్రలు పెట్టుకున్నాయి. తాగిన పాలు వాంతుల రూపంలో మరలా బయటకు వచ్చేస్తుండటంతో ఆందోళన చెందిన ఆ బిడ్డ తల్లిదండ్రులను ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించగా వారు పరీక్షలు, స్కానింగ్‌ల పేరుతో వేలాది రూపాయలు గుంజిని వైనం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే....


 త్రాగిన పాలు కక్కుతున్నాడని డాక్టరు సలహామేరకు స్కేనింగ్ కొరకు, కాకినాడ నగరంలో పేరుగాంచిన భానుగుడి సెంటర్లో గల సత్య స్కేన్ కి తీసుకేళ్తె  25,000 బ్లడ్‌ ప్లేట్‌లెట్స్  ఉన్నాయని  రిపోర్ట్‌ ఇచ్చారు. అంతవరకూ భాగానే ఉంది. ఆ రిపోర్ట్‌ తీసుకోని డాక్టర్ గారి దగ్గరకు వెల్తే ఆ డాక్టర్ వెంటనే ఓ పెద్ద ప్రైవేటు హాస్పిటల్ కి తీసికెళ్ళి కాపడుకోమని  చెప్పారు. 
ఆ బాలుడి తండ్రి ఉద్యోగ వెతుకులాటలో హైదరబాద్ లో స్నేహితుడి దగ్గర ఉంటున్నడు.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం గ్రామస్తులైన ఆ బాలుడి తల్లిదండ్రులు హుటహుటిన కాకినాడలోని ఆ ప్రైవేటు హాస్పిటల్‌కి వెల్లారు. ఆదే రోజున 2 గంటల వ్యవధిలో ఆ హాస్పిటల్‌ వాల్లు మళ్ళి స్కేన్ చేసి రిపోర్ట్‌ ఇచ్చారు. అందులో 4 లక్షల పేబడి బ్లడ్‌ ప్లేట్‌లెట్స్‌ ఉన్నాయని ఆ రిపోర్ట్‌లో తేలింది. అయినప్పటికీ  రెండు రోజులు పాటు ఆ పసిబాలుడిని అబ్జర్వేషన్‌లో ఉంచాలని బాక్స్ లో పెట్టారు. ఆ బాలుడి తండ్రి స్నేహితులంతా అక్కడే ఉండి నిద్రాహారాలు మానుకొని, మానసిక క్షొభతొ మళ్ళి మళ్ళి స్కేనింగ్లకు, మందులకు తిరిగారు. సుమారు రూ. 50 వేలు నష్టపోయిన తర్వాత, సత్య స్కేన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్‌ తప్పు అని తేలింది.  
 
ఎందుకు తప్పుడు రిపోర్ట్‌ ఇచ్చారని ఆ గ్రామస్తులు సత్య స్కేన్ సిబ్బందిని నిలదీయగా, మిషన్ తప్పులు ఇస్తాయని, తప్పులు ఎవరైనా చేస్తారని, ఇది మీ విషయంలో జరిగిందని బదులిచ్చినట్టు బాలుని తల్లిదండ్రులు వాపోయారు. మనుషుల ఆరోగ్యాలతో కమీషన్ల కోసం ఆడుకోనే ఇటువంటి అవినీతి జలగలకు బుద్ది చెప్పాలనే ఉద్దేశ్యంతో  కలక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్టు కుటుంభ సభ్యులు వెల్లడించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: