టీడీపీ పార్టీకి సీట్లు తక్కువచ్చిన ఓట్ల శాతం బాగానే వచ్చింది. కానీ, సీట్లు మాత్రం అత్యంత దారుణంగా దక్కాయి. 'ఎక్కడ తేడా కొట్టింది.?' అంటూ తెలుగుదేశం పార్టీ తెగ గించేసుకుంటోంది. ఎన్నికల ముందర తాయిలాలు గట్టిగా పనిచేయబట్టి, ఆ ఓటు బ్యాంకు అలా నిలబడింది తప్ప.. అదేదో 'బలం' అనుకుంటే పొరపాటేనని సాక్షాత్తూ టీడీపీ నేతలే ఆఫ్‌ ది రికార్డ్‌గా ముచ్చటించుకుంటున్నారు. 


చెయ్యాల్సినదానికన్నా ఎక్కువే చేశాం.. ఎక్కడ తేడా కొట్టిందో అర్థం కావడంలేదు.. అయినా, బాధ్యతగల ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం..' అంటూ చంద్రబాబు చెప్పుకున్నారు. ఇక్కడిదాకా బాగానే వుంది.. అధికార పక్షంపై చంద్రబాబు తనదైన స్టయిల్లో విమర్శలు చేయడం, అదీ రాజకీయ దాడులు - హత్యల గురించి మాట్లాడటమే అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.


చంద్రబాబు హయాంలో, వైసీపీకి చెందిన నేతలు.. కార్యకర్తల్ని ఏ స్థాయిలో తెలుగు తమ్ముళ్ళు ఊచ కోత కోశారో చూశాం. నేతలు పోతేనేం, కార్యకర్తలు మా వెంటే వున్నారు..' అని తెలంగాణలో చెప్పుకుంటూ.. బుకాయించే ప్రయత్నం చేసి.. చేతులు కాల్చుకున్న టీడీపీ, ఇప్పుడు ఏపీలో ఓటు బ్యాంకు పేరు చెప్పి, వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే.. అంతే సంగతులు.!


మరింత సమాచారం తెలుసుకోండి: