తెలుగుదేశం పార్టీ సీన్ ఇపుడు క్లైమాక్స్ కి వచ్చినట్లే కనిపిస్తోంది. చంద్రబాబు నాయకత్వంలో దారుణంగా పార్టీ ఓడిపోయింది. పార్టీ భవిష్యత్తు కళ్ళ ముందే కనిపిస్తోంది. చంద్రబాబు ఎపుడూ చెప్పే నీతులు, ఉపన్యాసాలు నేతలకు ఏ మాత్రం పట్టడంలేదు. 


దాంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. తాజా ఎన్నికల దెబ్బకు టీడీపీ మరో పదేళ్ళు చూసుకోనక్కరలేదని సీనియర్లు భావిస్తున్నారుట. టీడీపీకి 2029 వరకూ నో చాన్స్ అని డిసైడ్ ఐపోతున్నారుట. ఏపీలో యువ ముఖ్యమంత్రి జగన్ నాయకత్వం ఉంది. ఆయన దూకుడు చూస్తూంటే వచ్చే ఎన్నికల్లోనూ గెలవడం ఖాయం. మరో వైపు కేంద్రంలో బీజేపీ తప్ప వేరే దారి లేదు


ఈ నేపధ్యంలో ఇపుడు టీడీపీలో ఉండి చేసేదేముందని పెద్ద తలకాయలు జంపింగ్ అంటున్నాయట. అనంతపురం జిల్లాకు చెందిన జేసీ ఫ్యామిలీ ఇపుడు బీజేపీ గూట్లోకి వెళ్తోంది. ఈ మేరకు మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి, ఆయన తనయుడు పవన్ రెడ్డి ఇద్దరూ కూడా ఢిల్లీలో బీజేపీ పెద్దలని కలిశారట. జేసీకి రాజ్యసభ ఎంపీ టికెట్ ఆఫర్ చేశారట.


దాంతో మంచి రోజు చూసుకుని మొత్తం కుటుంబం జంప్ అంటున్నారు. జేసీ ఫ్యామిలీకి అనంతపురం జిల్లా బాధ్యతలు అప్పగిస్తారని టాక్ నడుస్తోంది.  మొత్తం మీద చూసుకుంటే బాబు నాయకత్వంలో మళ్ళీ టీడీపీ బతికి బట్టకట్టదని తెల్సిన వాళ్ళంతా జై బీజేపీ అనేస్తున్నారు. ఇంకో న్యూస్ ఏంటి అంటే పరిటాల ఫ్యామిలీ కూడా బీజేపీ వైపే వస్తుందట.  మొత్తానికి చూస్తే బాబుకు షాకే మరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: