- నిలిచిన చంద్రన్న బీమా పథకం
సామ్యాన్యులు ఎవరైనా మరణించిన్నటైతే వారి దహన సంస్కారాలకు, కుటుంభానికి ఆసరాగా నిలవాలని  గత ప్రభుత్వం అమలుచేసిన బీమా పథకంపై నీలినీడలు అలముకున్నాయి.  కుటుంబ పెద్దలను కోల్పోయిన వారిని ఆర్థికంగా ఆదుకుంది. ప్రస్తుతం ఈ పధకం అమలు కాకపోడంతో అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి.


గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన చంద్రన్న భీమా పథకం  ప్రస్తుతం నిలిచిపోయింది. మే 31 తో భీమా గడువు ముగిసింది. ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో రెన్యువల్ కాలేదు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా నెల రోజులకు పైగా ప్రమాద, సహజ మరణాలకు సంబంధించిన క్లెయిమ్స్ నిలిచిపోయాయి.


శ్రీకాకుళం జిల్లాలో ఒక్క నెలలో 150 మంది మృతుచెందినట్లు నమోదైనా భీమా పరిహారం చెల్లింపులు మాత్రం అందలేదు. దీంతో జిల్లాలో 15.3 లక్షల మంది చంద్రన్న భీమా లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గత మూడేళ్ళుగా చంద్రన్న భీమా పథకం పేరిట ప్రీమియంలు చెల్లిస్తూ వస్తోంది. ఈ ఏడాది మే నెలాఖరుతో బీమాకు గడువు ముగిసింది. 


జూన్ కల్లా ప్రీమియం చెల్లించాల్సివుంది. కానీ ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. కేంద్ర , రాష్ట్ర  ప్రభుత్వాలు కుటుంబానికి చెరో రూ. 200 ప్రీమియం చెల్లించాల్సివుంది . మొత్తం ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, తాము ఇకపై చెల్లిచబోమని తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో చంద్రన్న భీమా పధకంపై నీలినీడలు కమ్ముకున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: