ఏపీలో తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి టీడీపీ, వైసీపీ పార్టీలు. తమ వారికి వేధించి వెంటాడుతున్నారని టీడీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేస్తే తమ వారిని టీడీపీ వారే కక్ష సాధింపుతో వేధిస్తూ తప్పుడు ఫిర్యాదు చేస్తున్నారని అంటున్నారు.  నాయకులు అన్న వారు సహ‌నం పాటించాలి. తమ వారిని కూడా దారిలో నడిపించాలి. కానీ రాజకీయాల్లో ఇపుడు దిగజారుడు కాలం నడుస్తోంది. 


 అధినేతలే తోలు తీస్తాం, తోకలు కట్ చేస్టాం అంటున్న రోజులివి. మరి ఏమీ తెలియని అమాయకపు, మూర్ఖపు అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు, తప్పకుండా అమీ తుమీ తేల్చుకోవాలనుకుంటారు. గత రెండు దశాబ్దాలుగా చూసుకుంటే తమిళనాడును పోలిన రాజకీయాలు ఏపీలోనూ జరుగుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా సోషల్ మీడియాలో ఏకంగా హోం మంత్రి మీదనే అసభ్య పోస్టింగులు పెడుతున్నారని కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.


 ఇక తమ పార్టీకి చెందిన ఆరుగురిని వైసీపీ నాయకులు చంపేశారని , పార్టీ మీటింగులో చంద్రబాబు లెక్కలు కూడా చెబుతున్నారు. 182 మందిపై భౌతిక దాడులు చేశారని చంద్రబాబు లెక్కలు చెప్పి మరీ  కుప్పంలో ప్రచారం స్టార్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో పార్టీ నాయకులకు గట్టి హెచ్చరికలు పంపారు కూడా. ఎవరు గొడవలకు దిగవద్దు, జనంలో చెడ్డ పేరు తీసుకురావద్దు, అని ఇక టీడీపీ  విషయానికి వస్తే రాయి వేయాలని చూస్తూనే ఉంటుంది. 


కాబట్టి ఎక్కువగా జాగ్రత్త పడాల్సింది వైసీపీనే. ఇక టీడీపీ కూడా తెగే దాక లాగకూడదు, అది చివరకు ప్రమాదకరమైన క్రీడలా మారితే అసలుకే ఎసరు వస్తుంది. ఏది ఏమైనా తెలంగాణాలో పరిస్థితి బాగుంది కర్నాటకలో బాగుంది. ఏపీలోనే ఎందుకిలా అన్నది పార్టీలు ఆలోచన చేయాలి. గెలుపు ఓటములు శాశ్వతం ఎవరికీ కావు.



మరింత సమాచారం తెలుసుకోండి: