వినటానికి కాస్త ఇబ్బందిగానే ఉన్నా చివరకు అదే జరుగబోతోందంటూ టిడిపి వర్గాలే చెబుతున్నాయి. తొందరలోనే అమెరికాలో తానా సభలు జరగబోతున్న విషయం అందరికీ తెలిసిందే. తెలుగు ప్రపంచానికి అవి తానా సభలే అయినా టిడిపికి మాత్రం సమాధి కట్టేందుకు ఉద్దేశించిన కార్యక్రమంగా ప్రచారం జరుగుతోంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే టిడిపి నుండి బయటకు వచ్చేయటానికి రెడీగా ఉన్న ఎంఎల్ఏలకు తానా సభల సాక్షిగా ప్యాకేజీలు మాట్లాడుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  టిడిపి ఎంఎల్ఏలను, నేతలను బిజెపిలోకి చేర్చుకునే విషయంలో చర్చలు జరుగుతున్నాయన్న ప్రయత్నాలు అందరికీ తెలిసిందే.

 

ఈ ప్రయత్నాలను పక్కనపెడితే టిడిపి ఎంఎల్ఏలను, నేతలు బిజెపిలోకి లాక్కునే బాధ్యత ఏపి ఇన్చార్జి రామ్ మాధవ్ స్వయంగా చూస్తున్నారు. అటువంటి రామ్ మాధవ్ తానా సభలకు హాజరవుతున్నారట. అదే సభలకు రామ్ మాధవ్ తో పాటు ఈమధ్యనే బిజెపిలోకి ఫిరాయించిన టిడిపి రాజ్యసభ ఎంపిలు సుజనాచౌదరి, గరికపాటి మోహన్ రావు, టిజి వెంకటేష్, సిఎం రమేష్ కూడా హాజరవుతారట.

 

వీళ్ళ హాజరు విషయాన్ని పక్కనపెడితే టిడిపి నుండి పయ్యావుల కేశవ్, గంటా శ్రీనివాసరావు తదితర టిడిపి ప్రముఖులు కూడా హాజరవుతున్నారట. అంటే ఇటు బిజెపి అటు టిడిపి నేతలంతా ఒకేచోట మూడు రోజుల పాటు ఉండబోతున్నారు. ఇంకేముంది ఫిరాయింపుల ప్యాకేజీల చర్చలకు కొదవే ఉండదనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. విషయం తెలిసిన వెంటనే చంద్రబాబునాయుడు ఉలిక్కిపడ్డారట. అయినా ఏమీ చేయలేకపోయారని సమాచారం.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: