చంద్రబాబు నాయుడు ఒక భహిరంగ సభలో ఓటమి పై పలు విషయాలను పంచుకున్నారు. వైసీపీ ప్ర‌భుత్వం పైన అప్పుడే ప్ర‌జా వ్య‌తిరేక‌త మొద‌లైంద‌ని చెప్పుకొచ్చారు. అనుభ‌వం లేని నాయకుడి పాల‌న సాగుతోంద‌ని విమ‌ర్శించారు. ఎన్ని క‌ల స‌మయంలో నోటీకేది వ‌స్తే అది చెప్పేశార‌ని..అవి తీర్చ‌లేక ఇప్పుడు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని వివ‌రించారు. మ‌ళ్ళీ విజ‌యం టీడీపీదే..ఇది త‌ధ్యం అని ధీమా వ్య‌క్తం చేసారు.


ఇక‌..బీజేపీ - వైసీపీ క‌లయిక గురించి సైతం మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కీల‌క కామెంట్లు చేసారు. తాను జాగ్ర‌త్త ప‌డి ఉంటే ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌ని చంద్ర‌బాబు ఎన్నిక‌ల ఫ‌లితాల మీద విశ్లేష‌ణ చేసారు. ఏపీలో నెల రోజుల పాల‌న మీద టీడీపీ అధినేత‌..మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కొత్త విశ్లేష‌ణ చేసారు. జ‌గ‌న్ ఇచ్చిన హామీలు అల‌వికానివేన‌ని తేల్చి చెప్పారు. వాటిని ఎవ‌రూ తీర్చ‌లేర‌ని స్ప‌ష్టం చేసారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయ‌టం..కాంట్రాక్టు ఉద్యోగుల‌ను రెగ్యుల‌రైజ్ చేయ‌టం..సీపీఎస్ ర‌ద్దు వంటి అమ‌ల‌య్యే అవ‌కాశమే లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.


ఇంత అనుభ‌వం ఉండీ తానెందుకు చేయ‌లేక‌పోయానో ఆలోచించాల‌ని పార్టీ నేత‌లకు సూచించారు. ఎన్నిక‌ల ముందు నోటికేది వ‌స్తే అది చెప్పేసార‌ని..అవి తీర్చ‌లేక ఇప్పుడు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చంద్ర‌బాబు విశ్లేషించారు. మ‌ళ్లీ విజ‌యం టీడీపీదే అంటూ ధీమా వ్య‌క్తం చేసారు. అదే స‌మ‌యంలో పార్టీ నేత‌ల గురించి అధినేత కొన్ని వ్యాఖ్య‌లు చేసారు. ప్ర‌జ‌లు వారే ఓట్లు వేస్తార‌ని కొంత మంది నేత‌లు ఇంట్లో నిద్ర‌పోయార‌ని .. ఆ అతి విశ్వాసం పార్టీకి న‌ష్టం చేసింద‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: