తెలుగుదేశంపార్టీకి చెందిన 18 మంది ఎంఎల్ఏలు బిజెపితో టచ్ లో ఉన్నారా ? ఆ పార్టీ నేత తాజాగా చేసిన ప్రకటన బట్టి అలాగే అనుకోవాల్సొస్తోంది. పార్టీ తరపున బిజెపి ఇన్చార్జి సునీల్ దియోధర్  ఢిల్లీలో చేసిన ప్రకటన కలకలం సృష్టిస్తోంది.

 

ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ టిడిపికి చెందిన 18 మంది ఎంఎల్ఏలు తమతో టచ్ లో ఉన్నట్లు పెద్ద బాంబే పేల్చారు. సమయం చూసుకుని వారంతా తమ పార్టీలోకి వచ్చేస్తారన్నట్లుగా చెప్పారు.  మొన్నటి ఎన్నికల్లో పార్టీ తరపున గెలిచిందే 23 మంది ఎంఎల్ఏలు. అందులో కూడా 18 మంది ఎంఎల్ఏలు బిజెపిలోకి వెళిపోతారంటే మామూలు విషయం కాదు.

 

పైగా చంద్రబాబునాయుడు తొందరలో జైలుకు కూడా వెళతారంటూ జోస్యం చెప్పటం సంచలనంగా మారింది.  ఐదేళ్ళ పాలనలో జరిగిన అవినీతికి చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా అవినీతికి పాల్పడినట్లు చెప్పారు.

 

చంద్రబాబు చేసిన అవినీతి వల్లే పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు లేకుండా పోయిందన్నారు. భవిష్యత్ లేని టిడిపిలో ఉండటం కంటే బిజెపిలోకి వచ్చేయటమే మేలని చాలామంది నేతలు సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. అందుకనే ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు చాలామంది తమ అగ్రనేతలతో టచ్ లో ఉన్నట్లు చెప్పటం నిజమే అయితే చంద్రబాబు పుట్టి ముణిగినట్లే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: