జగన్ చంద్రశేఖర్ అనే ఇద్దరు మిత్రులు ఉన్నారు ఆ ఇద్దరు మిత్రులు కలసి వ్యవసాయం చేయాలని అయిన ఖర్చు లో చెరి సగం డబ్బులు పెట్టుకుందామని వచ్చిన పంట ని చెరిసగం చేసుకుందామని అనుకున్నారు...

 

 సీనియర్ అయిన చంద్రశేఖర్ ని వ్యవసాయం చేయమన్నాడు జగన్...

 

 చంద్రశేఖర్ -- వేరుశెనగ చేను వేసాడు చేను బాగా పూత కి వచ్చింది జగన్ పిలిచి  పైన పంట కావాలా, కింద పంట కావాలా అని అడిగాడు...

 

జగన్ -- వేరుశెనగ చేను విరగబూసి ఉంది నాకు పైనా పంట కావాలని అడిగాడు...

 

 చంద్రశేఖర్ -- చేను పండిన తర్వాత భూమిలో వేరుశెనగ కాయలు కోసుకుని చెట్లను జగన్ కి ఇచ్చాడు, చంద్రశేఖర్ కి లాభం వచ్చింది జగన్ కి నష్టం వచ్చింది...

 

 చంద్రశేఖర్ -- రెండోసారి వరి పంట వేసాడు.మళ్లీ జగన్ ని పిలిచి నీకు పైన పంట కావాలా, కింద పంట కావాలా అని అడిగాడు...

 

జగన్ -- మొన్న మోసపోయాను కాబట్టి ఇప్పుడు కింద పంట కావాలని అడిగాడు...

 

 చంద్రశేఖర్ -- పైన వరికంకులు కోసుకుని కింద ఉన్న గడ్డిని జగన్ కు ఇచ్చాడు-మళ్లీ  మోసపోయాడు...

 

 చంద్రశేఖర్ -- మూడో సారి మొక్కజొన్న ,చెరకు పంట వేశాడు మళ్లీ జగన్ పిలిచాడు నీకి పై పంట కావాలా,కింద పంట కావాలా అని అడిగాడు...

 

  జగన్ -- ఈసారి తెలివిగా ఆలోచించి పైన కింద రెండూ కావాలని అడిగాడు...

 

 చంద్రశేఖర్ -- ఈసారి  మధ్యలో ఉన్న మొక్కజొన్న కండెలు,చెరకు గడలు విరుచుకుని ని పైన కిందా చోప్పను ఇచ్చాడు..

 

 3 సార్లు మోసపోయిన జగన్ చంద్రశేఖర్ దగ్గరికి వెళ్లి నేను మోసపోయాను నన్ను ఇంటి దగ్గర తిడతారు నా డబ్బులు నాకు ఇచ్చేయి అని అడిగాడు... 

 

ఇంట్లో వాళ్లకి మన  చంద్రబాబు మోసం చేశాడని చెప్పు ఇంటికాడ చంద్రబాబు ని తిట్టి నిన్ను వదిలేస్తారు అని సలహా ఇచ్చాడు చంద్రశేఖర్...

మరింత సమాచారం తెలుసుకోండి: