జగన్ కుడి భుజం విజయసాయిరెడ్డి. ఏపీ పాలిటిక్స్ లో విజయసాయిరెడ్డి ఒక్కసారిగా ప్రముఖ వ్యక్త్రి అయిపోయారు. ఆయన కనుసన్నల్లో వైసీపీ పార్టీ, ప్రభుత్వం నడుస్తున్నాయని అంతా అనుకుంటున్నారు. అటువంటి విజయసాయిరెడ్డికి షాక్  వార్తనా.


ఢిల్లీలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిదిగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిని నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేసినట్లు సమాచారం వచ్చింది. బహుశా లాభదాయక పదవుల కింద వస్తే ,అది చెల్లకుండాపోతుందన్న భావనతో ఈ రద్దు నిర్ణయం వెలువడి ఉండవచ్చని భావిస్తున్నారు.కొద్ది రోజుల క్రితమే ఈ నియామకం జరిగింది.


విజయసాయిరెడ్డికి క్యాబినెట్ ర్యాంక్ ఇస్తూ నిర్ణయం చేశారు.అయితే ఎమ్.పిగా కూడా ఉన్నందున చట్టం ప్రకారం ఈ పదవి ఇవ్వడం ఇబ్బంది కావచ్చని భావించి ఉండవచ్చు.  ఏది ఏమైనా విజయసాయిరెడ్డి వంటి సీనియర్, జగన్ కి ఆత్మ లాంటి వ్యక్త్రి నియామాకం రద్దు అంటే ఒకింత షాకింగ్ న్యూసే. కానీ నిబంధనల ప్రకారం ఆయనకు ఇది కుదరదు మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: