రాష్ట్రం విపత్కర పరిస్థితులను ఎదుర్కోబోతోంది. మరో ఆరు నెలల్లో అంటే వచ్చే ఏడాదిలో తిండిగింజల కొరత తలెత్తనుంది. ఇది శాస్త్రవేత్తలు చెబుతున్న మాటకాదు. ఎవరైతే తిండిగింజలను ఉత్పత్తి చేస్తారో ఆ రైతులే వారి బాధలను, భవిష్యత్‌ ఇబ్బందులను వెల్లడిస్తున్నారు.  దానికి కారణం వర్షాభావి పరిస్థితులు, విత్తనాలు, ఎరువుల కొరతగా చెబుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ వర్షాలు అంతగా పడకపోడంతో పంటల తీరు ఆశించినంతగా లేదని వాపోతున్నారు. చెదురుమదురుగా వచ్చే వర్షాలతో బోర్లద్వారా పొలానికి నీరు పెడుతున్నా మార్కెట్లో విత్తనాలు ఎరువుల కొరత తీవ్రంగా వేదిస్తోందని రైతులు వాపోతున్నారు. 
రాష్ట్ర వ్యాప్తంగా జూన్ లో 62.3 శాతం లోటు ఉన్నట్టు వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గడిచిన వందేళ్లల్లలో జూన్ మాసంలో నాలుగు సార్లు మాత్రమే ఇలాంటి దుర్భిక్షం ఎదురయినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మరలా ఈ ఏడాది జూన్ లో ఇలాంటి దుస్థితి తలెత్తిందంటున్నారు.  అక్కడక్కడా కొన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే 48.3 శాతం అధికంగా కురవగా, మిగిలిన జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది.
 
గతేడాది ఖరీఫ్ సమయంలో జూన్ మొదటి వారంలోనే 'నీటిపారుదల సలహా మండలి' (ఐఏబి)  సమావేశాన్ని నిర్వహించారు. జలాశయాల్లో పుష్కలంగా నీరు ఉండటంతో వెంటవెంటనే కాలువల్లో నీటి విడుదలకు మండలి నిర్ణయం తీసుకుంది. అసలు ఖరీఫ్ సీజన్ నే.. రికార్డు స్థాయిలో ముందుకు తెచ్చారు. గతేడాది జూన్ 10వ తేదీకే సీజన్ ఆరంభమైంది, విస్తారంగా వర్షాలు కురవడంతో రైతులకు కలిసొచ్చింది. ఈ ఏడాది వర్షాబావ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటంతో రైతులు దిగాలు పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: