ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి కనీసం నెల రోజులు పూర్తి కాక మునుపే చంద్రబాబు తనదైన విమర్శలు షురూ చేశారు. అయితే 'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాటలను ప్రజలు నమ్మరు..' అని తేల్చారు చంద్రబాబు నాయుడు. ఎన్నికల ఫలితాలు వచ్చి ఇంకా నెలన్నరే అవుతూ ఉంది. ప్రజలు ఎవరి మాటలను నమ్మారో ఆ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు? ఎలాంటి కబుర్లు చెప్పారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏమన్నారు? తన గురించి ఏం చెప్పుకున్నారో అందరికీ తెలిసిందే.


అదే ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబుపై మాటల యుద్ధం చేసింది. చంద్రబాబు ఐదేళ్లపాలన గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన వెర్షన్ చెప్పింది. అలాంటి మాటల యుద్ధం అనంతరం వచ్చిన ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజేతగా నిలవగా, తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లకు పరిమితం అయ్యి కుదేలయ్యింది. ఇదంతా జరిగి నెలన్నర కావొస్తోంది.


చంద్రబాబు నాయుడు ఎంతగా ప్రజలకు భ్రమలను కల్పించాలని చూసినా, ఆయన తరఫున మెజారిటీ మీడియా ఎంతగా హడావుడి చేసినా.. చివరకు ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిఫలింపజేశాయి. అయితే ఇంతలోనే చంద్రబాబు నాయుడు మళ్లీ పాతమాటలే మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు తన మాటలనే నమ్ముతారని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ ఉన్నారు. విత్తనాల కొరత అంశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాదనను ప్రజలు నమ్మరని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నారు! ఇలా చెప్పుకోవడంలోనే చంద్రబాబుకు ఆనందం ఉండొచ్చు. ఎన్నికలకు ముందు కూడా ఇలాగే చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాదలనను ప్రజలు విశ్వసించరని చంద్రబాబు తేల్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: