బడ్జెట్ అంటే ఎన్నో ఆశలు, మరెన్నో వూహలు, ఏదో జరిగిపోతుందని భ్రమలు పైగా మీడియా హైప్ పెరిగాక ప్రతీవారూ కూడా బడ్జెట్ గురించి ఆలోచనలు చేస్తున్నారు. ఏదో లాభం చేస్తారని, మనమున్న ప్రాంతానికి,  రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఇలా అంచనాలతో ఉంటారు.


అయితే ప్రతీ బడ్జెట్ కూడా ఆశల వాకిలిని తాకుండానే పక్కకు పోతోంది. అది యూపీయే సర్కార్ అయినా, మోడీ ప్రభుత్వమైనా కూడా బడ్జెట్ అంటే ఏపీ వూసు ఉండదు, అదేంటో మరి. పోనీ అయిదేళ్ళ క్రితం లా ఉమ్మడి ఏపీకి చేసినా చేయకపోయినా కొంతవరకూ తట్టుకోగలదు, కానీ ఇపుడు విడగొట్టేశారు. పదమూడు జిల్లాల ఏపీ తాడూ బొంగరం లేకుండా ఉంది. మరి ఈ సమయంలో కూడా న్యాయం చేయకపోవడం పైనే అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఏపీకి ఎన్నో జాతీయ  విద్యా సంస్థలు ఇచ్చామని అంటున్నారు. కానీ వాటికి నిధులు మాత్రం ఇవ్వడంలేదు. ఎన్ని బడ్జెట్లు మారినా ఈ కధ ఇంతేలా  ఉంది. ఇక పోలవరం, రాజధాని నగరం నిర్మాణం వంటి పెద్ద బడ్జెట్ ప్రాజెక్టులకు కూడా బడ్జెట్లో విదిలించినది లేదు. విశాఖకు రైవే జోన్ అన్నారు కానీ అది ఆరు నెలలైనా అతీ గతీ లేదు. దాని గురించి ప్రస్తావన కూడా లేదు. ఇక కొత్త లైన్లు, రైళ్ళు అన్న ప్రశ్న అసలే లేదు. మొత్తానికి ఏపీకి ఈ బడ్జెట్ మరో మారు మొండిచేయి చూపించని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: