మోడీ అంటే మొండి అంటారు. అయిదేళ్ల ఆయన పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలను కదిపి కుదపడం ఎవరి వల్లా కాలేదు. మోడీ తలచుకుంటే ఏమైనా చేయగల శక్త్రిమంతుడు. అందులో డౌటే లేదు. పెద్ద గొంతుకతో మీద పడే ఆడపులి మమతా బెనర్జీ ఇపుడు ఎక్కడ ఉన్నారో చూస్తే మోడీ ప్రతాపం ఏంటో అర్ధమవుతుంది.


మరి మోడీని ఢీ కొట్టే సాహసం జగన్ చేస్తారా. తనకు తెలుగు రాష్ట్రాల మీద ప్రత్యేకమైన ప్రేమ లేదని మోడీ చెప్పేశారు. నేనేది విదిలిస్తే అదే ప్రసాదంలా తీసుకోడంటూ క్లారిటీగా చెప్పేస్తున్నారు. మరి మోడీని ఎదిరించిన పాపానికి పరిహారం చెల్లిస్తున్న బాబు ఓ వైపు ఉన్నారు. ఇక జగన్ కి రాజకీయాల్లో పదేళ్ళ అనుభవం మాత్రమే ఉంది. ఏపీ అయిదేళ్ళ పసిపాప, జగన్ కొత్త పాలకుడు. 


ఈ నేపధ్యంలో కేంద్రంతో గొడవ పెట్టుకుంటే కుదిరే వ్యవహారమేనా అన్నది చూడాలి. కేంద్ర సాయం లేకపోతే ఇపుడు అడుగు తీసి అడుగు వేయదు. బాబుని బదనాం చేసినట్లే జగన్ని చేద్దామని బీజేపీ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇదంతా ఓపెన్ గానే చేస్తున్నారు. మరి జగన్ ఎదిరించి ఏం సాధిస్తారు. అలాగని గమ్మున ఉంటే టీడీపీ వూరుకుంటుందా. ఓ విధంగా చెప్పాలంటే ఇపుడు బాబు పాత్రలో జగన్ ఉన్నారు. జగన్ పాత్రలోకి బాబు మారారు. మరి చూడాలి జగన్ ఎలా మోడీతో ఢీ కొడతారో.


మరింత సమాచారం తెలుసుకోండి: