ఏంటో, తెలుగు రాష్ట్రాలు అంటే ఎం అనుకుంటున్నారో ఏమో, ప్రతి ఒక్కరికి తెలుగు రాష్ట్రాలే కావాలి.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలే కావాలి, ప్రతి ఒక్కరు తెలుగురాష్ట్రాలను పరిపాలించాలి అనుకునే వారే, తెలంగాణ కోసం ఎన్నో సంవత్సరాలు పోరాడి తెలంగాణను సాధించుకున్న కేసీఆర్ సీఎం అయ్యి పరిపాలిస్తుంటే, అటు ఆంధ్రాలో గత 9 ఏళ్లగా ఓదార్పు యాత్ర అని, పాద యాత్ర అని సంవత్సరాలు కొద్దీ రోడ్లపైన చొప్పులు అరిగేలా తిరిగి రాజ్యాన్ని సంపాదించుకున్న జగన్ నుంచి రాజ్యాన్ని లాక్కోవాలని చూస్తున్నారు కొందరు. 


అవునండి, గత నలభై ఏళ్లగా చంద్రబాబు చేసిన పాపాలు అన్ని ఇప్పుడు పండయ్యి. అందుకే 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న వాడిని కేవలం 40 ఏళ్ళు వయసు ఉన్నవాడు చిత్తు చిత్తుగా ఓడించాడు. ఇప్పుడు రాజన్న రాజ్యంల, ప్రజలకే తన జీవితం అనుకోని పరిపాలిస్తున్నాడు రాజన్న పుత్రుడు. ఇది అంత ఎందుకు చెప్తున్నా అంటే గతం అండి, మర్చిపోకూడదు అని చెప్తున్నా. రెండేళ్లల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకొంటాయని అంటున్నారు హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. 


కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి 'బీజేపీ సభ్యత్వ నమోదు' కార్యక్రమానికి విజయవాడకు ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రెండేళ్లలో తెలుగు రాష్ట్రాలలో ఎవరు ఊహించని విధంగా రాజకీయ పరిణామాలు ఉంటాయన్నారు. ఆంధ్రాలో మాజీ ముఖ్యమంత్రి కొడుకు, తెలంగాణాలో ముఖ్యమంత్రి కూతురు ఎన్నికల్లో ఓటమిపాలయ్యారని ఆయన వ్యాఖ్య చేసారు. చంద్రబాబు గురించి విమర్శిస్తూ రానున్న రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో మార్పులు అనుకోని రీతిలో జరుగుతాయని మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేసారు. ఆ మార్పులు ఏంటి ? రెండేళ్లలో బీజేపీ పడిపోతుందా ? లేక తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పోయి జాతీయ పార్టీ బీజేపీ వస్తుందా అనేది చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: