సరదాగా సాయంత్రం బీచ్ ఒడ్డున నడుస్తుంటే, చల్లటి గాలి మనల్ని తాకి ఎన్నో కబుర్లు చెబుతుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది.రోజంతా పని వత్తిడిలో ఉండి కాసేపు ప్రశాంతంగా గడపడానికి, సముద్రపు అలలతో ఆదుకోవడానికి బీచ్ కు వెళ్ళేవారి సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది.

అలా అనుకొనే బీచ్ కి వెళ్లారు ఇజ్రాయిల్ దేశ ప్రజలు కూడా కానీ అనుకోకుండా పెద్ద ప్రమాదమే ఎదుర్కొన్నారు.సముద్రపు అలలతో ఆడుకుందాం అనుకుని వెళ్ళారు కానీ అలలతో పాటు జెల్లీ ఫిష్ లు కూడా వచ్చే సరికి భయంతో పరుగులు తీశారు.అవును ఇజ్రాయిల్ లోని సముద్ర తీరానికి కొన్ని లక్షల జెల్లీ ఫిష్ లు కొట్టుకుని వచ్చాయి. దీని కారణంగా పర్యాటకులకు ముప్పు ఏర్పడుతుందని తెలుస్తుంది.ఈ నేపథ్యంలో పర్యాటకులకు,మత్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.కాగా ఈ సమస్య కేవలం ఇజ్రాయిల్ సముద్ర తీరానికే పరిమితం  కాలేదు. ప్రపంచవ్యాప్తంగా జెల్లీఫిష్ ఆ సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ కారణంగా ప్రతి ఏటా సుమారు 15 కోట్ల మంది పర్యాటకులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలుస్తుంది.

 జీవ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం జెల్లీఫిష్ 50 కోట్ల సంవత్సరాల పురాతన జీవి. ఇది సముద్రాలు,నదులలో కనిపిస్తుంటాయి. జెల్లీ ఫిష్ కాటు వేయడం మూలంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 100 నుండి 150 మంది మృత్యువాత పడుతున్నారు. ఆస్ట్రేలియాలో 2018-19 సంవత్సరాలలో జెల్లీ ఫిష్ ల తాకిడి తట్టుకోలేక 18 బీచ్ల్ లను మూసేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: