కేంద్రంలోని ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేసింది. ఎవరేమనుకుంటే మాకేంటి మా బడ్జెట్ మా ఇష్టం అన్నారు మోడీ. తనకు ఏం కావాలో అవి మాత్రమే బడ్జెట్లో చూపించి మసాలా సినిమాయే తీశారు. ఎన్నికలు అయిపోయినా తాయిలాలు మాత్రం మోడీ బడ్జెట్లో ఆగడంలేదు. ఆ చేత్తోనే ఏపీకి ఎంగిలి మెతుకులు కూడా విదిలించింది లేదు. అది వేరే విషయం


ఇక ఏపీ బడ్జెట్ రిలీజ్ అవుతోంది. ఈ నేల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. 12న ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ బడ్జెట్ ప్రవేశపెడతారు. మరి జగన్ బడ్జెట్ ఎలా ఉంటుందన్నది అందరికీ ఆసక్తిగా ఉంది.


ఏపీలో ఓ బలమైన ప్రాంతీయ పార్టీ టీడీపీని దించేసి మరో బలమైన పార్టీ వైసీపీ అధికారంలోకి వచ్చింది. సొంతంగా పార్టీ పార్టీ పెట్టి అధికారంలోకి రావడం ఏపీలో  ఓ రికార్డు. అన్న నందమూరి తరువాత జగన్ ఆ క్రెడిట్ సాధించారు. ఇక తొలి బడ్జెట్లో జగన్ ఏ రికార్డులు క్రియేట్ చేస్తారోనని అంతా ఎదురుచూస్తున్నారు.


జగన్ మాటలను బట్టి నవ రత్నాలకు బడ్జెట్లో పెద్ద పీట వేయడం ఖాయం. ఇక అభివ్రుధ్ధి పనులకు ఎంతెంత కేటాయించారో చూడాలి. అలాగే పోలవరం, అమరావతి ప్రయారిటీలు కూడా బడ్జెట్లో చూడొచ్చు. మొత్తానికి 11 నుంచి బడ్జెట్ మీటింగులుంటాయని జగన్ సర్కార్ అధికారికంగా ఈ రోజు ప్రకటించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: