Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 3:50 am IST

Menu &Sections

Search

ఈ చర్య 'జగన్' స్థాయిని తగ్గించేదే !

ఈ చర్య  'జగన్' స్థాయిని తగ్గించేదే !
ఈ చర్య 'జగన్' స్థాయిని తగ్గించేదే !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

గొప్ప పని చేయనప్పుడు  చేసిన పనినే గొప్పగా చెప్పుకోవాలని  ఓ పెద్ద మనిషి చెప్పాడు. ఆయితే ఈ సూక్తిని మన రాజకీయనాయకులు బ్లైండ్ గా ఫాలో అయిపోతుంటారు. తాము ఏమి చేస్తే..  అదే గొప్ప ఘనకార్యం అన్నట్లు  ఓ రేంజ్ లో పబ్లిసిటి ఇచ్చుకుంటారు. నిజాలను పాతరేసి, ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు మాయచేయడంలో  చంద్రబాబుగోరు మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు.  మన బాబుగోరు  తాను చేసున్న పనే గొప్పదని... అందరూ అదే అనుకోవాలని సత్యాలను అసత్యాలుగా నమ్మించిన సందర్భాలు కోకొల్లలు. అయితే విచిత్రంగా మన  జగన్ మోహన్ రెడ్డి కూడా బాబుగోరి దారిలో వెళ్తున్నారు. 


బాబుగోరికి మల్లే  తన గొప్పలు చెప్పుకోవటానికి కొన్ని వాస్తవాలను  దాచిపెడుతున్నాడు జగన్.  సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మొదటిరోజే  పెంఛన్లు 2250 ఇస్తున్నట్లు జగన్  ప్రకటించాడు, తీరా ఆ రోజు ప్రకటన ఈ రోజుకి కానీ ఆచరణలోకి రాలేదు. ఈ రోజు నుండే  పెంఛన్లు ఇవ్వటం స్టార్ట్ చేసారు. అయితే ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. 'నాలుగునెలల క్రితం తాతఅవ్వలను  మీకు పెంఛన్లు వస్తున్నాయంటే.. చాలమంది రావటం లేదని చేప్పేవాళ్లు.. కేవలం కొద్దీ మంది మాత్రమే 1000 ఇస్తున్నారని చెప్పారు. కానీ  నేను సీఎం అయిన మొదటి నెలలోనే దానిని 2250కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నానని జగన్ చెప్పుకొచ్చాడు. 

  

వాస్తవానికి చంద్రబాబు నాయుడు  2019  జనవరిలోనే  1000 రూపాయాల పెన్షన్ ను 2000కి పెంచారు. అందరికీ  పెన్షన్ ను ఇచ్చారు. అందేలా చూశారు. ఓట్లు కోసమే అనుకోండి.  అయితే  బాబు పెంచిన    పెన్షన్ ను జగన్ మాత్రం ఎక్కడ మాట్లాడకుండా  తనే  1000 నుండి 2250కి  పెంచినట్లు పబ్లిసిటీ చేసుకుంటున్నాడు.  బాబు తన ఐదేళ్ల పదవి కాలంలో అంతకుముందు ఉన్న పెన్షన్ కి  10 రేట్లు పెంచాడు.  జగన్ కేవలం రెండున్నర రేట్లు పెంచాడు. మరి ఇది ప్రజలకి అర్ధం కాదా..  బాబు ఘనత కూడా తనదే అని చెప్పుకోవడం జగన్ స్థాయిని  తగ్గించేదే.  


jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో  స్పోర్ట్స్  డ్రామా !
మహేష్ ఇంట్రస్టింగ్ లుక్ !
రెండో ఘట్టంలో  'విరాట పర్వం` !
 ఒక్క ఎలెక్షన్ తో  మొత్తం పోతుంది !
మెగాస్టార్ కి  బాలీవుడ్ స్టార్స్  కి  పోటి తప్పేలా లేదు !
అక్కడ 'గ్యాంగ్ లీడర్' పరిస్థితి ఏంటి ?
'కళ్యాణ్ రామ్' కామెడీ చేయగలడా  ?
పాపం.. ఈ హిట్ బ్యూటీకి  ఛాన్స్ లు లేవు !
'భీష్మ'  వీళ్లను  ఏమి చేస్తాడో  ?
 'జగన్ - బాబు'ల పై  పవన్ ఇంట్రస్టింగ్ ప్లాన్ !
 'ముదురు భామ'తో ప్రేమ  నిజమే !
 ఇవి చెయ్యకపోతే  'జగన్' ఇక కష్టమే !
గజదొంగ కామెడీ  బాగా చేస్తాడట !
ప్చ్..  టీడీపీని బతకనించేలా లేరు !
మోదీకి జగన్ శత్రువుగా మారాడా ?
కాలేజీలకు వెళ్లనున్న 'గుణ 369' !
  'బాబు'ను ముంచేయటానికి  'జగన్' స్కెచ్ !
జగన్ పై  'బాబు' అదిరిపోయే ప్లాన్  !
'ఇస్మార్ట్ శంకర్'  సెకెండ్ డే కలెక్షన్స్  !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.