కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో వివిధ విభాగాల్లో సేవలందిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు బకాయి ఉన్న 6 నెలల జీతాలు ఇప్పించాలని శుక్రవారం మధ్యాహ్నం జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు కు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జెఎసి నాయకులు వినతి పత్రం సమర్పించారు.


ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ ఇచ్చే కొద్ది పాటి జీతం కూడా 6 నెలలు బకాయి ఉంటే ఉద్యోగుల కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఆలోచించాలన్నారు... విద్యా సంవత్సరం ప్రారంభం అవడంతో పిల్లల ఫీజులు, పుస్తకాల ఖర్చులకే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు...ఇంటి అద్దెలు, కుటుంబ జీవనం అప్పులతోనే సాగుతుందన్నారు.... స్థానిక ఎమ్మెల్యే చొరవతో జీతాల పెంపుదలకు ఉన్నతాధికారులకు ఫైల్ పెట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు.


దీనిపై సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ మారిపోయారని బాధ్యులు విధుల్లో చేరగానే అనుమతి తీసుకుని జీతాలు విడుదల చేస్తామన్నారు....ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కమిటీ సభ్యుడు ఏసూరి శ్రీనివాస్ తో పాటు కె.ఎస్‌.ప్రభాకర్, పి.ఎస్.రాయుడు, ప్రసాద్, రమణ, చిన్ని తదితరులు పాల్గొన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: