గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఐటిడిఎ టూరిజం పనుల్లో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని పాలకొండ ఎమ్మెల్యే విశ్యాసరాయి కళావతి ఆరోపించారు. ఎన్టీఆర్ అడ్వాంచర్ పార్కులో టూరిజం శాఖా ద్వారా రూ.55 లక్షలు మంజూరు చేస్తే పర్యాటక శాఖా కాకుండా ట్రైబల్  వెల్ ఫేర్ ఇంజనీరింగ్ శాఖా ద్వారా బినామీలకు అడ్వాన్సులు ఇచ్చి ఎలా పనులుచేయిస్తారని ప్రశ్నించారు. కన్వర్జెన్సీ పేరుతో ఈ పార్కుకు రూ.2.14 కోట్లు వెచ్చించారని , దీనిలో నిధుల దుర్వినియోగం జరిగిందని , వెంటనే విజిలెన్స్ విచారణ చేయించాలన్నారు. 


ఇదే పార్క్ ప్రారంభించడానికి  అప్పటి మంత్రి లోకేష్ ను పిలిచి రూ.47 లక్షలు కర్చు చేసి నిధులు ధుభారా చేశారన్నారు. రూ.27 కోట్ల జగతపల్లి రిసార్ట్స్ ప్రాజెక్ట్ కు నాల్గో తరగతి బినామీ కాంట్రాక్టర్ అవతారం ఎత్తిన కోటేశ్వర రావుకు టెండర్ ద్వారా పనులు కట్టబెట్టారన్నారు. 12 నెలలుగా 5 శాతం పనులు కూడా చేయని కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. సబ్ ప్లాన్ నిధులు కూడా గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. 


పాఠశాలల మరమ్మత్తులకు రూ.కోట్లు వరకు వెచ్చించినా... వాటిని పూర్తీ చెయ్యకుండా ఆ నిధులను దుర్వినియోగం చేశారని ఆమె అన్నారు. కనీసం మరుగు దొడ్లకు రన్నింగ్ వాటర్ కూడా ఇవ్వని దుస్థితిలో గిరిజన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేయకుండా ఉండిపోయిన 42 రోడ్లపైనే  మళ్లీ రహదారుల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారన్నారు. దీనిపై  ప్రభుత్వం విచారణ చేపట్టాలని కళావతి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: