గత రెండు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో అటు అధికార పక్షం ఇటు ప్రతి పక్షం ఒకరి పై ఒకరు పరస్పరం దాడులు చేసుకుంటూ అసెంబ్లీ లో హీట్ ను పెంచుతున్నారు. ఈ సమావేశాలను ఉపయోగించుకొని అధికార పక్షం, ప్రతి పక్షాన్ని దొంగగా చూపాలని ప్రయత్నిస్తుంది.అలాగే ప్రతి పక్షం కూడా ఈ సమావేశాలను ఉపయోగించుకొని అధికార పక్షాన్ని  దొంగలుగా చూపించాలని ప్రయత్నిస్తుంది.

మొదటి రెండు రోజులలో కరువు పై మరియు రైతులకు వడ్డీ లేని రుణాల పై చర్చలు జరిగాయి. ఈ సమావేశాలలో ప్రభుత్వం ప్రతి పక్షానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది.దానితో ప్రతి పక్షం తమదైన శైలిలో 40 రోజుల ప్రభుత్వం పై దాడి చేసింది.

దీనిని అదునుగా తీసుకున్న పచ్చ మీడియా జగన్ ను మరియు వైసీపీ ని దొంగలుగా చూపుతూ చంద్రబాబు నాయుడు కు ప్రజలలో సానుభూతి తెచ్చే ప్రయత్నాలను కథనాలను మొదలు పెడుతుంది.గతంలో ఇలాంటివి చేయడం వల్లే విసుగెత్తిన జనం టీడీపీ ని గద్దె దించారు.మరిప్పుడు దానిని ప్రజలు స్వాగతిస్తారా అనేది తెలుసుకోవడానికి మరికొన్ని రోజులు వేచి చూడాల్సింది.


మరింత సమాచారం తెలుసుకోండి: