ఎచ్చెర్లలో డాక్టర్ బీఆర్ అంబేత్కర్  విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 12 (బి) కమిటీ గురువారం సందర్శించింది. యూనివర్సిటీలో అన్ని విభాగాలను పరిశీలించారు. బోధనా సిబ్బంది , విద్యాప్రమాణాలు , కోర్సుల నిర్వహణ , విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను వైఎస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కునరామ్ జిని అడిగి తెలుసుకున్నారు. ముందుగా వర్సిటీ పరిపాలన  కార్యాలయంలోని విసి , ఇతర అధికారులతో సమావేశం నిర్వహించి వర్సిటీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. 


అనంతరం పాలక మండలి సమావేశంలో వర్సిటీ అధికారులు , విభాగాధి పతులు , కోర్సు కోఆర్డినేటర్లతో  సమీక్ష సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీ చరిత్ర , విధ్యార్థులకు కల్పిస్తున్న పసతులు ,  విద్యాప్రమాణాలపై యూజీసీ 12 (బి) కమిషన్ సభ్యులకు కుమ రామ్ జి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.2008 జూన్  25న వర్సిటీ ప్రారంభమైందని , వర్సిటీ పరిధిలో 124 అనుబంధ కళాశాలలో సుమారు 60 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. ప్రస్తుతం వర్సిటీలో ఆర్ట్స్ లో 12 , సైన్స్ లో 9 , ఇంజినీరింగ్ లో 4 విభాగాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 


10 మంది రెగ్యులర్ బోధకులు , 86 మంది అర్హులైన బోధకులు ఉన్నట్లు చెప్పారు. ఐదుగురు ప్రొఫేసర్లు , 10 మంది అసోసియేటెడ్ ప్రొఫేసర్లు , 33 మంది అసిస్టెంట్ ప్రొఫసర్ పోస్టుల భర్తీ దశలో ఉన్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రాభుత్వం నిధులు కేటాయిస్తోంది , యూజీసీ నిధులు కేటాయిస్తే అభివృద్ధికి మరింత ఆస్కారం ఉంటుందని అన్నారు. 12 (బి) గుర్తింపు ఉంటేనే రూసా నిధులు మంజూరయ్యే అవకాశం ఉండడంతో వర్సిటీకి గుర్తింపు ఇవ్వాలని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: