తాజాగా ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెండు అంశాలపైనే జగన్మోహన్ రెడ్డి భారీ ఆశలే పెట్టుకున్నట్లు కనబడుతోంది. మొత్తం 2.28 లక్షల కోట్ల బడ్జెట్లో రెండు అంశాలు చాలా కీలకపాత్ర పోషించబోతున్నాయి. మొదటిది పన్నులు, రెండోది గ్రాంట్ ఇన్ ఎయిడ్. మొదటిదేమో రాష్ట్రప్రభుత్వం పరిధిలోనిది అయితే రెండోదేమో కేంద్రం పరిధిలోనిది. జగన్ ఆశలు నెరవేరాలంటే ఈ రెండు సానుకూలం కావాల్సిందే.

 

 

తాజా బడ్జెట్లో అంకెలు చూడటానికి ఘనంగానే ఉంది. కానీ అది వాస్తవంలోకి వచ్చినపుడే జగన్ ఆశలైనా, ఆలోచనలైనా నెరవేరుతుంది. లేకపోతే బడ్జెట్ తో జనాలు మోసం చేసినట్లే అని ప్రతిపక్షాలు, మీడియా మండిపడటం ఖాయం. ఎందుకంటే, మొన్నటి వరకూ చంద్రబాబునాయుడు చేసింది ఇదే కాబట్టి. కాకపోతే మీడియా దన్నుంది కాబట్టి చంద్రబాబు చేసిన మోసం పెద్దగా బయటకు రాలేదు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే తాజా బడ్జెట్లో పన్నుల వసూళ్ళ అంచనాను రూ 75,437 కోట్లుగా లెక్కగట్టారు. అలాగే కేంద్రం నుండి వస్తుందని అనుకుంటున్న గ్రాంట్ ఇన్ ఎయిడ్ ను రూ. 61,071 కోట్లుగా అంచనా వేశారు. అంటే ఈ రెండు పద్దుల ద్వారానే రాష్ట్ర ఖజానాకు రూ. 1,36,508 కోట్లు వస్తాయని జగన్ అంచనా వేశారు. చంద్రబాబు కూడా ఇలా అంచనాలు వేసే బొక్కబోర్లా పడ్డారు.


చంద్రబాబు హయాంలో పన్నులు రూ. 65,535 కోట్లు వస్తుందని అంచనా వేస్తే వచ్చింది రూ 58,125 కోట్లు మాత్రమే. అంటే రూ. 7,407 కోట్లు బొక్కపడింది. మరి జగన్ మాత్రం అదే పన్ను వసూళ్ళను 75,437 కోట్లుగా చూపారు. అంటే మొత్తం వసూళ్ళు కాకపోతే ఎంతో కొంత మైనస్సే. అలాగే, గ్రాంట్ ఇన్ ఎయిడ్ క్రింద కేంద్రం నుండి చంద్రబాబు రూ. 50,695 కొట్లు వస్తుందని అనుకుంటే వచ్చింది రూ.  19,456 కోట్లు మాత్రమే. దాదాపు రూ. 30 వేల కోట్లు బొక్కపడింది. ఇపుడు జగన్ ఈ మొత్తాన్ని రూ. 61,071 కోట్లుగా అంచనా వేశారు. మరి ఎంతొస్తుందో చూడాల్సిందే. సాధించగలిగితే నిజంగానే హీరోనే. మరి తేలేకపోతే....


మరింత సమాచారం తెలుసుకోండి: