గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ విద్యారంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేసింది. విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని చెబుతూ వచ్చిన ముఖ్య మంత్రి అందుకు అనుగుణంగా తన మొదటి బాజ్టెక్టులోనే బారిగా నిధులు కేటాయింపు చేసి విద్యా వేతనాలను సైతం ఆశ్చర్యానికి గురిచేశారు. అటు విద్యార్థులు , ఇటు తల్లిదండ్రులు మనసు  దోచుకున్నారు. 1 నుంచి 10 తరగతి వరకు చుదుతున్న విద్యార్థులతో పాటు ఇంటర్ మీడియట్ విద్యార్థులకు దీన్ని వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. 

ఈ పథకం కింద తెలుపు రేషన్ కార్డు కలిగిన విద్యార్థి తల్లి బ్యాంకుకు రూ.15 వేల చొప్పున జమచేయనున్నారు. జిల్లాలో ఈ పథకం కింద సుమారు  3.20 లక్షల మంది ప్రయోజనం పొందనున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద ఫీజు నూటికి నూరు శాతం ఉచిత విద్యను అందించే ఉద్దేశంతో రీయింబర్స్ మెంట్ పథకాన్ని కూడా జగన్ సర్కార్ తీసుకురానుంది . దీంతో పాటు హాస్టల్ లో ఉంటున్న విద్యార్థులకు ఏటా  రూ.20 వేల చొప్పున అందజేయనున్నారు. 

  వీటి కోసం రూ.4962 కోట్లు కేటాయించినట్లు తెలుస్తుంది. దీని ద్వారా జిల్లాలో సుమారు 92 వేల మంది వరకు విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం  ప్రత్యేకంగా దృష్టి సాదించారు. ప్రస్తుత సర్కార్ పాఠశాలల రూపురేఖలను రెండేళ్లలోపు మార్చేయాలనే ఉద్దేశంతో పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు , వసతులు కల్పించేందుకు రూ.1500 కోట్లు కేటాయించింటినట్లు తెలిపారు. జిల్లాలో 3285 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన జరగనుంది . ఆంగ్లమాద్యమం ద్వారా చదువుల విప్లవానికి  శ్రీకారం చుట్టనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: