సినిమా రంగానికి రాజకీయ రంగానికి విడదీయలేని సంబంధం ఉంది.సినిమా హీరోలు గా అభిమానులను సంపాదించుకున్న ఎన్టీఆర్, ఎంజీర్ రాజకీయాల్లో ఎదిగి ముఖ్యమంత్రులుగా ప్రజలకు సేవలందించిన సంగతి మనకు తెలుసు. ఆనాటి నుండి ఈనాటి వరకు సినిమా తారలు రాజకీయాలలో రాణిస్తూనే ఉన్నారు.

గడచిన ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు పోటీపడ్డాయి. అందులో ఒకటి "జనసేన",ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా సినిమా నటుడే. రాజకీయలను ప్రజలకు మరింత దగ్గర చేయడానికి, పార్టీ ప్రయోజనాలకు సినీ తారలను అస్త్రాలుగా ఉపయోగుస్తుంటారు మన రాజకీయ నాయకులు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వెలుగులోకి వచ్చిన కమెడియన్ పృథ్వి వైసీపీ తరపున ప్రచారం కూడా చేశారు.

అయితే ఇప్పుడు పృథ్వికి సీఎం జగన్ కీలక పదవి అప్పగించారు.శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి ఛానల్ కు చైర్మన్ గా ఆయనను నియమించారు. టిడిపి ప్రభుత్వంలో ఈ పదవిలో ఉన్న దర్శకుడు రాఘవేంద్రరావు...వైసీపీ ప్రభుత్వం రాగానే తన పదవికి రాజీనామా చేశారు.దీంతో ఖాళీగా ఉన్న ఆ స్థానాన్ని ఇప్పుడు పృధ్వికి జగన్ అప్పగించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: