చంద్రబాబు వయసు ఇప్పుడు 69 ఏళ్ళు. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత చంద్రబాబు వయసు గురించి మీడియాలో ఎక్కువగా చర్చకు వచ్చింది. ఈ వయసులో చంద్రబాబు పార్టీని కాపాడుకోగలడా ? అని. చంద్రబాబుకు ప్రస్తుతం 69 ఏళ్లు. వచ్చే ఎన్నికలనాటికి దాదాపు 75 ఏళ్లు వస్తాయి. అప్పటికి ఆయన శారీరక పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. మొన్నటి ఎన్నికల్లో ఆయన గెలిచి అధికారం చేపట్టివుంటే ఉత్సాహం ఉరకలేసేది.


ఆయన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్నా, తనవంతు పాత్ర పోషిస్తున్నప్పటికీ ఓటమి బాధ నుంచి ఆయన ఇంకా తేరుకోలేదనేది స్పష్టంగా కనబడుతోంది. ఆరోగ్యపరంగా చెప్పాలంటే చాలామంది నాయకులకంటే బాబు ఆరోగ్యంగానే ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన ఎలావుందన్నది పక్కన పెడితే అయిదేళ్లూ చాలా చురుగ్గా ఉన్నారు. తీరికలేని పర్యటనలు చేసినా, గంటల తరబడి సమీక్షా సమావేశాలు నిర్వహించినా ఆయన ఆరోగ్యం దెబ్బతిన్న దాఖలాలు లేవు.


అయితే ఇప్పుడు చంద్రబాబుకు ఉన్నది మానసికమైన ఆందోళనే. పెరుగుతున్న వయసుకు తోడు ఓటమిపాలవడంతో పార్టీని కాపాడుకోవడం బాబుకు సవాలుగా మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కుమారుడు కేటీఆర్‌ అండగా ఉన్నాడు. కాని బాబుకు ఆ అదృష్టం ఉన్నట్లు కనిపించడంలేదు. బాబు వారసుడిగా లోకేష్‌ టీడీపీ నడిపిస్తాడనే నమ్మకం కనబడటంలేదు. వయసు పెరుగుతున్నా బాబు పోరాటం చేయాల్సిందేనా? 

మరింత సమాచారం తెలుసుకోండి: