టీడీపీ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితి ఇంతకముందెన్నడు లేదని చెప్పాలి. పార్టీ ఎన్నికల్లో కంచుకోటలను కూడా కోల్పోయి, ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు తమ భవిష్యత్ గురించి ఆలోచనలో పడిపోయారు. ఈ క్రమంలోనే కొందరు వేరే పార్టీల్లోకి వెళ్తుండగా, మరికొందరు మాత్రం అధినేతకు సలహాలు ఇస్తున్నారు.


ఇందులో భాగంగానే ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న పలువురు సీనియర్ నేతలు ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పగ్గాలు నందమూరి బాలకృష్ణకు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని చంద్రబాబు ముందుంచారట. ఇలా చేయడం వల్ల పార్టీపై ప్రజల్లో అనుకూలత వచ్చే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని కూడా ప్రస్తావించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరికొందరైతే, నందమూరి బాలకృష్ణను అధ్యక్షుడిని చేయాలని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట.


ఎలాగో ఏపీ నాయకత్వాన్ని మార్చాలని టీడీపీ అధిష్ఠానం భావిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ నేతలు బాలయ్య గురించి ఆలోచన చేశారని తెలుస్తోంది. వాస్తవానికి కొద్దిరోజులుగా దీనికి సంబంధించిన వార్తలు ఏపీ రాజకీయ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు కళా వెంకట్రావును తీసేసి, ఆయన స్థానంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడును నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడేమో బాలయ్య పేరు తెరపైకి వచ్చింది.  వచ్చే ఐదేళ్ల పాటు ఓటు బ్యాంకును కాపాడుకోవాలంటే బాలయ్య లాంటి వ్యక్తి అయితేనే కరెక్ట్ అని పార్టీ నేతలు భావిస్తున్నారని బహిరంగంగానే అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: