అంగన్ వాడీ కార్యకర్తలు, సహాయకులకు అండగా నిలుస్తామని , వారి సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని రాష్ట్ర రహదారుల, భావన నిర్మాణ శాఖ మంత్రి కృష్ణ  దాస్ అన్నారు. నరసన్న పేటలో నిర్వహించిన అంగన్ వాడీ కార్యకర్తలు , సహాయకుల సంఘం జిల్లా 7వ మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సంగర్బంగా సంఘం ప్రతినిధులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రాలను అందజేశారు. అంగన్ వాడీ కార్యకర్తలు , సహాయకులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటామని , అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి  పేర్కొన్నారు. 

నరసన్న పేటలో అంగన్వాడీ కార్యకర్తలు , సహాయకుల సంఘం జిల్లా 7వ రెండు రోజుల మహా సభలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ అయిదేళ్ల కాలంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించారు. ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  తన పాదయాత్ర ద్వారా సమస్యలపై అవగాహన పెంచుకున్నారని , అంగన్ వాడీ కార్యకర్తల సమస్యలపై అయన దృష్టకి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే అంగన్ వాడీ కార్యకర్తల వేతనాలు పెంచామని ఈ క్రమేణా అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. 

కార్యకర్తల పై ఎక్కడా వేధింపులకు తావు లేదని స్పష్టం చేసారు. కార్యాక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు అమ్మ  ఒడిని వర్తింపజేయాలని కోరారు. అంగం వాడీ కేంద్రాలకు అమ్మ ఒడిని వర్తింపజేస్తే ప్రభుత్వ విద్యకు సార్థకత ఉంటుందన్నారు.  ఇప్పటికే ఇంటర్మీడియట్ అమ్మ ఒడిని ప్రకటించిన ప్రభుత్వం అంగన్ వాడీ పిల్లలకు కూడా వర్తింపజేయాలని కోరారు. అంగన్ వాడీ కార్యకర్తలపైన రాజకీయ వేధింపులు సరికాదన్నారు. కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: