స్వంత గడ్డమీద వన్డే వరల్డ్‌కప్‌ను సాధించి తమ చిరకాల కోరిక తీర్చుకోవాలనే కసితో ఉంది ఇంగ్లండ్‌. 27 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరిన ఈ టీమ్‌ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మెగా ట్రోఫీని వదులుకోకూడదని భావిస్తోంది. మరో వైపు కివీస్‌ కూడా తొలి వరల్డ్‌కప్‌ను వదులుకో దలుచుకోలేదు. వరల్డ్‌కప్‌ గెలిచి, ఇంగ్లండ్‌కు షాకివ్వాలని యోచిస్తోంది, కివీస్‌.. ఏదేమైనా, కొత్త చాంపియన్‌ అవతరించనున్న తరుణంలో ఇరు జట్ల మధ్య ఈరోజు క్రికెట్‌ పుట్టినిల్లు లార్డ్స్‌లో జరుగనున్న క్రికెట్‌ సమరం అభిమానుల్లో ఆలజడి రేపుతోంది.

న్యూజిలాండ్‌ మొదట్నుంచి సర్వశక్తుల్ని ఒడ్డి, ఫైనల్‌కు చేరింది. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, నాకౌట్‌ సమరంలో బలమైన టీమిండియాను ఓడించింది. ఇపుడున్న పరిస్థితుల్లో కివీస్‌పై పైచేయి సాధించడం చాలా కష్టం. సమిష్టిగా పోరాడితేనే కివీస్‌ను ఓడించగలరు అని ఇంగ్లండ్‌ని హెచ్చరిస్తున్నారు క్రికెట్‌ పండితులు. ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌ ఎవరిదో అల్‌రెడీ డిసైడ్‌ చేశాడు ఓ యువకుడు.

అతడో మెకానికల్‌ ఇంజనీర్‌ . హ్యూండయ్‌ కంపెనీలో ఉద్యోగం. చెన్నై ట్రెక్కింగు క్లబ్బు సభ్యుడు. ఫేసు బుక్‌, ట్విట్టర్లు, వీడియోల్లో సందడి చేస్తున్నాడు. అతని పేరు బాలాజీ హసన్‌. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా, సంచలనం క్రియేట్‌ చేస్తున్నాడు.దానికి కారణం అతడు చెబుతున్న జోస్యాలు.

జ్యోతిష్యాన్ని తన వ్యక్తిగత ఆసక్తి కొద్దీ నేర్చుకుని, పదును పెట్టుకున్నాడు. ఇటీవల అతడు చెప్పిన ప్రెడిక్షన్లు నిజం అవుతుండటంతో సెలబ్రెటీగా మారాడు. 
1, డీఎంకే కూటమి బంపర్‌ గెలుపు సాధిస్తుందని,అన్నాడు అలాగే జరిగింది.
2, ఏపీలో జగన్‌ బంపర్‌ మెజారిటీ సాధించబోతున్నాడని చెప్పాడు, అదీ జరిగింది.
3, మొన్నటి ఎంపీ ఎన్నికల్లో ఎన్డీయేకు మెజారిటీ సీట్లు వస్తాయనీ, మోడీ మళ్లీ పీఎం అవుతాడని చెప్పాడు. పాకిస్తాన్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ గెలుపును ముందే చెప్పాడు.
4, వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్లో ఇండియా ఓడిపోతుందని ఏడు నెలల క్రితం చెప్పాడు. అంతేకాదు, న్యూజీలాండ్‌ కప్పు గెలుస్తుందని, విలియమ్సన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సీరీస్‌ అవుతాడు రాసి పెట్టుకోండి అని ఇపుడు చెబుతున్నాడు

అవి నిజమవుతాయా లేదా ఈ సాయంత్రం తేలిపోతుంది. దాదాపు యాభై వేల మంది ఫాలోయర్లున్న తన ఫేస్‌ బుక్‌ పేజీలో ఏయే ప్రెడిక్షన్లు నిజమయ్యాయో, నమోదు చేస్తున్నాడు. బాలాజీ జోస్యాల్లో 90 శాతం దాకా నిజం అవుతున్నాయనేది ఇప్పుడు తమిళనాట టాక్‌ !!

ఒక ఆటలో పలానా దేశం గెలుస్తుంది, ఒక ఆటలో ఓడిపోతుంది అని దేన్నిబట్టి చెబుతారో క్లారిటీ లేదుకానీ, జ్యోతిష్యాన్ని ఒక ప్రోపెషన్‌గా గాకుండా, ఓ అధ్యయనంలా చేపట్టిన ఈ యువకుడి వైపు, ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది!!


మరింత సమాచారం తెలుసుకోండి: