ఎన్నికల ఫలితాలు వచ్చి నెలన్నర దాటిన తరువాత, నాయకుల మీద పోస్ట్‌మార్డం మొదలైంది.
'' విభజిత ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం వ్యవహరించిన తీరుపై ఆత్మపరిశీలన చేసుకుంటే ''నేనేం తప్పుచేశాను?'' అన్న ప్రశ్నకు తావుండదు. ''చేసిన  అభివృద్ధి కళ్లెదుటే కనిపిస్తున్నా మరీ 23 సీట్లే గెలిపిస్తారా?'' అని వాపోతున్న చంద్రబాబుకు కేవలం  అభివృద్ధి మాత్రమే ఎన్నికలలో ఓట్లు రాల్చదన్న విషయం తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉంది....'' అని ఒక పాపులర్‌ రాజకీయ కాలమిస్టు అంటున్నారు.

ఆయన చెప్పిన విషయంలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ,  అభివృద్ధి అంతా అమరావతి చుట్టూ ,కొన్ని వర్గాలకు మేలు చేసినట్టు రాష్ట్ర ప్రజలు గుర్తించారు. అందుకే ఫలితాలు అలా వచ్చాయి.

'' ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం చంద్రబాబునాయుడు పార్టీని గాలికి వదిలేశారు. జిల్లాల పర్యటనలకు వెళ్లిన చంద్రబాబు ఒక్క రోజు కూడా పార్టీ కార్యకర్తలతో సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.
తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని గుర్తించి విరుగుడు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. తన ప్రత్యర్థి జగన్మోహన్‌రెడ్డికి కొన్ని బలమైన సామాజికవర్గాల మద్దతు ఉందన్న వాస్తవాన్ని గుర్తించకుండా తన అధికారానికి ఢోకా ఉండదని భావించారు. చంద్రబాబు మార్క్‌ పాలన కనిపించడం లేదని తొలి ఏడాదే ప్రజలలో అభిప్రాయం ఏర్పడినా.. దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించలేదు. పార్టీ శాసనసభ్యుల విచ్చలవిడితనాన్ని అరికట్టవలసిందిపోయి నిస్సహాయుడిగా ఉండిపోయారు. ఇసుక సరఫరా, జన్మభూమి కమిటీల వల్ల చెడ్డ పేరు వస్తున్నప్పటికీ పరిస్థితులను చక్కదిద్దకుండా బేఖాతరు చేశారు. కొందరు శాసనసభ్యులు, మంత్రులు అరాచకంగా ప్రవర్తించినా కట్టడి చేయలేకపోయారు...'' ఇదీ చంద్రబాబు తీరు పై ఆ రాజకీయ విశ్లేషకుడి విమర్శ.

నిజమే శాసనసభ్యుల విచ్చలవిడితనాన్ని అరికట్టవలసిన అవసరాన్ని ఆ పార్టీ నాయకుడి ముందుకు తీసుకెళ్లడంలో పత్రికల వైఫల్యం కూడా ఉంది. జన్మభూమి కమిటీల అరాచకాల మీద మీడియాలో కథనాలు వచ్చి ఉంటే చంద్రబాబు జాగ్రత్త పడేవారేమో... టీడీపీ ఓటమిలో మీడియా పాత్ర కూడా ఉందని సోషల్‌ మీడియాలో నెటిజన్లు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: