సలహాలు ఎవరు ఇస్తారు, మన మేలు కోరే వారే ఇస్తారు. ఏపీలో చూసుకుంటే టీడీపీ ఎపుడూ జగన్ని తిడుతూనే ఉంటుంది. జగన్ ఇబ్బంది పడాలన్నది ఆ పార్టీ అజెండాగా పెట్టుకుంది. ఇక బీజేపీ వైసీపీకి మిత్ర పక్షంలో, శత్రుపక్షమో తెలియడంలేదు. జగన్ మాత్రం కేంద్రంతో దోస్తీగా ఉంటున్నారు.


ఇక చాలా మంది బీజేపీ   నాయకులు జగన్ని, ఆయన సర్కార్ ని డైరెక్ట్ గా విమర్శలు చేస్తున్నారు. గట్టి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మరి ఇందరిలో ఒక్కడిగా  కాకుండా ఓ పెద్దాయన, సీఎం గా సీనియారిటీ బాగా ఉన్న మద్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎపి ముఖ్యమంత్రి జగన్ కు ఒక సలహా ఇచ్చారు. ఎపిలో మిగిలేవి వైఎస్ ఆర్ కాంగ్రెస్ , బిజెపిలేనని ఆయన అన్నారు. కుటుంబ పాలనకు బిజెపి వ్యతిరేకమని, ఏపిలో కుటుంబ పాలన వల్లే టిడిపి ఓటమి చెందిందని ఆయన అన్నారు. దీనిని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత, ముఖ్యమంత్రి జగన్ అనుభవం గా తీసుకోవాలని ఆయన సూచించారు.


జగన్ కూడా చంద్రబాబు తరహాలోనే కుటుంబ రాజకీయాలు చేస్తే దెబ్బ తింటారని ఆయన హెచ్చరించారు. కులాలు, మతాలు, కుటుంబ పాలనకు అతీతంగా.. అందరికీ అభివృద్ధి నినాదంతో భాజపా దేశవ్యాప్తంగా దూసుకుపోతోందని ఆయన అన్నారు. జగన్ మరి శివరాజ్ చౌహాన్ మాట వింటారా. ఇంతకీ ఆయన కూడా మంచికి చెప్పారా. సెటైర్లు వేశారా.


మరింత సమాచారం తెలుసుకోండి: