చంద్రబాబును అందుకే అపర చాణక్యుడు అనేది. ఆయన హ్యూమన్ సైకాలజీ బాగా చదివేశారు. అంతే కాదు, రాజకీయాలల్లో బలాలు, బలహీనత‌లపైన కూడా పీహెచ్ డీ చేశారు. అందువల్ల ఆయన ఇంతటి దారుణమైన ఓటమిని ఎదుర్కొన్నా నిబ్బరంగా ఉండగలుగుతున్నారు.


చంద్రబాబుకు నమ్మిన బంటు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరీ బీజేపీలోకి వెళ్లడంతోనే బాబు మాస్టర్ ప్లాన్ ఏంటో అర్ధమైపోయింది. తన మనుషులును జాగ్రత్తగా అక్కడకు చేర్పించి బాబు బీజేపీలో కూడా నేనున్నాను అనిపించుకుంటున్నారు. సుజనా, సీఎం రమేష్ వంటి వారు పార్టీ ఫిరాయిస్తే  కనీసం పెద్దగా స్పందించకపోవడంతోనే అప్పట్లో  బాబుపైన అనుమానాలు వచ్చాయి. ఇపుడు ఆ  డౌట్లు సుజానా తీర్చేశారు.



చంద్రబాబు నాయుడును కేంద్రం జైలులో పెడుతుందని తాను అనకోవడం లేదని సుజనా చౌదరి ఎవరికి మద్దతుగా అన్న చర్చ ఇపుడు వస్తోంది.  గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందా లేదా అన్నది విచారణ జరిపిస్తే గానీ చెప్పలేమని, అయితే పాలన మాత్రం గాడి తప్పిందని చెప్పగలనని సుజనా మీడియాతో అన్నారు.చంద్రబాబు ప్రభుత్వంలో గత ఐదేళ్లలో టీడీపీ నేతలు కోట్ల రూపాయలు లూటీ చేశారని సుజనా  ఆరోపించారు.


అంటే అక్కడికి బాబు మంచివారు, పార్టీ వారే చెడ్డవారు అన్నట్లుగా సుజనా తీర్పు ఉంది. అసలు బీజేపీ అరుపులే తప్ప బాబు మీద విచారణ జరిపించదని అందరికీ తెలుసు, ఒకవేళ ఆ ప్రమాదం ముంచుకువస్తే ఉప్పందించేందుకు, ఆదుకునేందుకు సుజనా చౌదరిని రెడీగానే బాబు పెట్టుకున్నాడని ఇపుడు అర్ధమవుతోంది. కాగా అదే సమయంలో బిజెపి రాష్ట్ర ఇన్ చార్జీ సునీల్ దియోధర్ మాత్రం చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: