నేను నిప్పును, నిజాయతీపరున్ని. ఈ మాట రోజుకు వందసార్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా చెప్పేవారు. ఇపుడు ప్రతిపక్షంలో ఉండగా కూడా ఆయన చెబుతున్నారు. మరి నిప్పుకు భయమెందుకు. చెదలు పట్టని వారికి ఈ గోల అసలే ఎందుకు.


విషయమేంటంటే  విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో అవినీతి బయటపెడతామని ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం స్పష్టం చేయడంతో విపక్ష నేత చంద్రబాబునాయుడుకు మింగుడు పడుతున్నట్లు లేదు. ఆయన వెంటనే దానిపై వ్యతిరేక ప్రచారం ఆరంభించారు.కేంద్రం దీనికి సంబందించి ఒకటి చెబుతుంటే ,రాష్ట్రం మరొకటి చేస్తోందని ఆయన అంటున్నట్లుగా భోగట్టా.


దీనిమీద  పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల సమావేశం పెట్టుకుని మరీ తన వ్యతిరేకతనూ తెలియచేస్తున్నారని టాక్. టీడీపీపై  బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రాభివృద్ధికి గండికొట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పీపీఏలలో అవినీతి లేదని, విద్యుత్‌ రంగానికి వచ్చే పెట్టుబడులు అడ్డుకోవద్దని కేంద్రమంత్రి, కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి లేఖలు రాసినా వైసిపి నేతలు మూర్ఖంగా వ్యవహరించడం శోచనీయమన్నారు.


వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని చంద్రబాబు ఆరోపించారు. తమ చేతకానితనం కప్పిపెట్టుకోవాలనే ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నారు. ఇవన్నీ సరే కానీ ఈ వూకదంపుడు ఎందుకు, నిజంగా విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి లేకపోతే భయమెందుకు అంటున్నారు వైసీపీ నేతలు. మరి బాబు ఉలుకు చూస్తే అక్కడ ముట్టుకుంటే షాక్ కొట్టినట్లే అనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: