జాబిల్లిని అందుకోవాలన్న ఇస్రో ప్రణాళిక వాయిదా పడింది.. అంతా బాగుంది.. చంద్రయాన్‌ 2 నింగికి ఎగురుతుంది.. అని ఆశించినా.. సాంకేతిక లోపం కారణంగా ప్రయోగం వాయిదా అన్న ప్రకటన ప్రజల్లో తీవ్ర నిరాశ నింపింది. అయితే.. మలి ప్రయోగం ఎప్పుడు? అనేది సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న...?
క్రయోజెనిక్‌ దశలో తలెత్తిన సాంకేతిక లోపంపై ఇస్రో శాస్త్రవేత్తలు అనేక కోణాల్లో పరిశీలన జరుపుతున్నారు. క్రయో ఇంజిన్‌లో సర్క్యూట్‌ ఉంటుంది. రాకెట్‌ ప్రయోగానికి గంట ముందు ఆ సర్క్యూట్‌లో పీడనం
(బార్‌) '30 నుంచి 320' వరకు ఉన్నట్లు సమాచారం. ఇది ఒక్కసారిగా పది నిమిషాల వ్యవధిలో '30 నుంచి 290' వరకు తగ్గిపోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాహకనౌకలో ఏర్పడిన లోపాలను గుర్తించేందుకు కమిటీలను నియమించారు.
దీనిలో ఉన్న సీనియర్‌ శాస్త్రవేత్తలు, లోపాలను గుర్తించి త్వరలోనే ఇస్రోకు నివేదిక సమర్పిస్తారని సమాచారం. రాకెట్‌ను ప్రయోగ వేదికపైనే ఉంచి , లోపాన్ని గుర్తించే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు.

చిన్న లోపం అయితే 3 రోజుల్లోనే సరిచేసి, మళ్లీ ప్రయోగం చేపట్టవచ్చు. ఒకవేళ లోపం పెద్దదైతే దానిని గుర్తించి, ఈ నెల 29, 30 తేదీల్లో ప్రయోగం చేపట్టాలని సైంటిస్టులు భావిస్తున్నారు. అయితే క్రయోజెనిక్‌ ఇంధన పీడనంలో లోపాలుంటే వాటికి కారణాలను గుర్తించి సరిచేయడం, తిరిగి 2వారాల్లోనే ప్రయోగానికి సిద్ధం చేయడం అంత ఈజీ కాదని, కనీసం రెండు నుండి మూడు నెలలు పట్టే అవకాశం ఉందని అంటే, సెప్టెంబరు,లేదా అక్టోబర్‌ లో ప్రయోగం జరగొచ్చని నిపుణులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: