మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట సమావేశాలు యాధావిథిగ ప్రారంభమయ్యాయి. నాల్గోవరోజు అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభలో తాగునీటి సరాఫరాకు సంబంధించిన సమస్యలను పలువురు సభ్యులు ప్రస్తావించారు. నెల్లూరు రూరల్‌లో మంచినీటి సమస్య గురించి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. తీరప్రాంతంలో కూడా మంచినీటి సమస్య తీర్చాలని నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు విజ్ఞప్తి చేశారు. వాటిపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు. పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలుకు నీటి సరఫరా చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి మంచినీటి సమస్య లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. వాటర్‌ గ్రిడ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సమస్యలకు సంబంధించి సభ్యుల నుంచి వచ్చిన ప్రశ్నలకు రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సమాధానమిచ్చారు. ఆటో డ్రైవర్ల కోసం బడ్జెట్‌లో రూ. 400 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ఆటో డ్రైవర్ల బాధలను దగ్గర నుంచి చూశారని చెప్పారు. ఆటోడ్రైవర్ల కష్టాలను చూసి వారికి ఏడాదికి రూ.10వేలు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇదే అంశాన్ని మేనిఫెస్టోలో కూడా పొందుపరిచినట్టు తెలిపారు. ఆ మేరకు ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 10వేలు ఇస్తామని స్పష్టం చేశారు.

ఆటో డ్రైవర్లకు ఏడాది రూ.10వేల వేతనంపై తెలుగుదేశం నేతలు పలు రకాల ప్రశ్నలు లెవనేత్తారు. రాష్ర్టంలో సొంత ఆటోలు కలిగిన వారు 3 లక్షమంది ఉన్నారని, మరో 5 లక్షల మంది ఆటోలను అద్దేకు తీసుకొని నడుపుతున్నారని తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన రూ.400 కోట్లు ఎవరికి ఇస్తారో స్పష్టం చేయాలన్నారు. మొత్తం 8 లక్షల మందికి ఈ పథకం వర్తింపచేస్తే 8,00,000*10,000 = రూ.800,00,000 కోట్లు ఖర్చు కేవలం ఒక్క ఏడాది వస్తుందని... కానీ ప్రభుత్వం కేటాయించిన రూ.400 కోట్లు ఏలా సరిపోతాయని తెలిపారు. దీనిపై అసెంబ్లీలో వైసీపీ నేతలు ఈ పథకం సంబందించి స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరారు.

కేవలం 5,67,990 లక్షల మంది ఆటో ఉన్నారని, 95, 742 ట్యాక్సీ క్యాబ్ లు ఉన్నాయని, 27,489 మ్యాక్సీ క్యాబ్ లు ఉన్నాయని మొత్తం 6,63,221 ఉన్నాయని తెలిపారు. ఇందులో ఆటో కం డ్రైవర్లు 3, 97, 932 మంది ఉన్నాటరాని అంచా వేసినా ముఖ్యమంత్రి రూ. 400 కోట్లు కేటాయించారని, ఎన్నికల ముందు కేవలం ఆటో డ్రైవర్లకు మాత్రమే వర్తింప చేసిన పథకానికి మెనిపెస్టోలో ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు కేటాయించారని నాని తెలిపారు. ఇక ఆటో, ట్యాక్సీలకు మూడు నెలలకు ఉన్న దాన్ని కేంద్ర ప్రభుత్వం 2017లో సంవత్సరానికి మార్చారని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: