ప్రభుత్వ ఉద్యొగులలో ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ పింఛన్ విధానాన్ని ఎన్.పీ.ఎస్ కొనసాగిస్తామని 2004 ముందు ఉన్న పాత పింఛన్ విధానాన్ని ఓ.పీ.ఎస్ మళ్లీ తెచ్చే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్ సమావేశాల్లో తెలియజేసింది. ఈ మేరకు ఒక లిఖిత పూర్వక సమాధానం కూడా ఇచ్చింది.

ఎన్.పీ.ఎస్ పద్దతిలో పదవీ విరమణ చేసే నాటికి ఉన్న జీతం సర్వీస్ కాలం ఆధారరంగా పింఛను ఉండేది దానివల్ల ఉద్యొగులకు పింఛను ఎక్కువగ ఉండేది. కాని 2004లో  తెచ్చిన కొత్త విధానం ఓ.పీ.ఎస్  ప్రకారం ఉద్యోగి జీతం నుండి పది శాతం మొత్తానికీ ప్రభుత్వం కూడా అంతే మొత్తం కలిపి మార్కెట్ లో పెట్టుబడి పెడుతుంది ఆ పెట్టుబడి పైన వచ్చే లాభాలు ఆధారంగా పింఛన్ ఇస్తారు.

దీన్ని తొలుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తప్పనిసరి చేయగా క్రమంగా రాష్ట్ర ప్రభుత్వా లు కూడా అమలులోకి తెచ్చాయి. కానీ ఈ కొత్త విధానంపై పలు ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయి వ్యతిరెకత వ్యక్తం చేశాయి. పాత పెన్షన్ విధానాన్ని మళ్ళి అమలు చేస్తామనే పార్టీకే తమ ఓటు వేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విధానాన్ని పున:ప్రవేశ పెట్టే అవకాశం లేదని సోమవారం పార్లమెంట్ లో చెప్పడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: