తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ బలంగా ఉన్నా,నాయకత్వంలో సమన్వయలోపంతో పార్టీ ఉనికి ప్రశ్నార్దకంగా మారింది. ఘనచరిత్ర కల్గిన పార్టీ జవసత్వాలు కోల్పోవడంతో ఇదే అదునుగా తెరాస,బీజేపీ లు క్యాడరును తమవైపు మళ్లించుకునే ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు.కాంగ్రెస్ క్యాడర్ ను తమవైపు తిప్పుకొని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా తెరాస యోచిస్తుంటే అదే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను టార్గెట్ చేసిన బీజేపీ సైతం తమ సభ్యత్వాలను రెండింతలు పెంచుకొని,తెరాస కు తామే ప్రత్యామ్నాయమని,దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వ్యూహాలను రచిస్తోంది.


ఇందులో భాగంగానే అమిత్ షా ను రంగంలోకి దించింది. పట్టణ ప్రాంతాల్లో కాస్త మెరుగ్గా ఉన్న బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా తమ పార్టీ సభ్యత్వాలను పెంచుకుని తెరాస ను ధీటుగా ఎదుర్కోవాలని భావిస్తుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో బీజేపీ అధిష్టానం భారీ ప్రణాళికలను రచిస్తోంది. అటు మండలిలో ,అసెంబ్లీలో కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదాను గల్లంతు చేసిన తెరాస సైతం కాంగ్రెస్ క్యాడర్ నే లక్ష్యంగా చేసుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జోరుగా కొనసాగిస్తుంది. దీన్ని ముఖ్యమంత్రే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.


తమ పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్న వాళ్లకు ఏకంగా రెండు లక్షల భీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది. సభ్యత్వాలను మెరుగుపర్చుకొని సంస్థాగతంగా మరింత బలపడి తిరుగులేని శక్తిగా ఎదగాలన్నది తెరాస భావన. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే రానున్న రోజుల్లో బీజేపీ, తెరాస ల మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది .

మరింత సమాచారం తెలుసుకోండి: