చంద్రబాబునాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంది. అడిగి వైసిపి నేతలతో మరీ తిట్టించుకుంటున్నట్లే ఉంది.  మంగళవారం అసెంబ్లీ సమావేశాలు చూసిన వారికందరికీ ఇదే అనుమానం మొదలైంది. అసెంబ్లీలో హుందాగా ఉండాల్సిన చంద్రబాబు తనంతట తానుగా చెత్తను ఎందుకు నెత్తినేసుకుంటున్నారో అర్ధం కావటం లేదు. అనవసరంగా కాపు రిజర్వేషన్ అంశాన్ని కెలుక్కుని మరీ వైసిపి వాళ్ళతో తిట్టించుకున్నారు.

 

2014 ఎన్నికల్లో జనాలకు తప్పుడు హామీలివ్వటం ద్వారానే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని అందరికీ తెలిసిందే.  మిగిలిన అంశాల సంగతి ఎలాగున్నా కాపులను బిసిల్లోకి చేర్చటమనే అంశం చాలా కీలకమైంది. నిజానికి కాపులకు బిసిల రిజర్వేషన్ కల్పించటం తన చేతిలో పనికాదన్న విషయం తెలిసీ తప్పుడు హామీలిచ్చారు. తర్వాత మొదలైన ఉద్యమ ఫలితంగా జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే.

 

చంద్రబాబు తమను మోసం చేశారని భావించిన కాపుల్లో అత్యధికులు మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలబడ్డారు. ఈరోజు అసెంబ్లీలో జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడుతూ కాపులకు తాను రిజర్వేషన్ కల్పిస్తే కేంద్రం తిరస్కరించిందన్నారు. తర్వాత కేంద్రం ఓబిసిల్లో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లో 5 శాతం కాపులకు కేటాయించటం తన ఘనతగా చెప్పుకున్నారు.  కాబట్టి తాను కేటాయించిన 5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారా ? చేయరా ? సూటిగా చెప్పమని జగన్ ను ప్రశ్నించారు.

 

దాంతో  జగన్ మాట్లాడుతూ చంద్రబాబును దుమ్ము దులిపేశారు. అసలు కాపులకు రిజర్వేషన్లు కల్పించానని చెప్పటమే చంద్రబాబు చేసిన మోసంగా చెప్పారు. అగ్రవర్ణాల్లోని పేదలకు కేంద్రం కల్పించిన 10 రిజర్వేషన్లలో కూడా మళ్ళీ 5 శాతం కాపులకు కేటాయించిన చంద్రబాబు మరో మోసం చేసినట్లు మండిపడ్డారు. అధికారంలో ఉండగా అన్నీ మోసాలు చేసిన చంద్రబాబు ఓడిపోయినా బుద్ధి ఇంకా మారలేదంటూ చంద్రబాబును జగన్ కసితీరా దుయ్యబట్టారు. అంతకుముందు మాట్లాడిన పలువురు వైసిపి నేతలు కూడా చంద్రబాబునే ఫుల్లుగా టార్గెట్ చేయటం గమనార్హం.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: