రాజకీయాలే అంత. ఎవరికి ఎవరు శత్రువులే తెలియదు. అవసరమే శత్రువులని, మిత్రులని తయారు చేస్తుందంటారు. ఏపీలో చూసుకుంటే సీనియర్ నేత చంద్రబాబునాయుడు గండరగండడు. ఆయనకు అవసరమైనపుడు ఎంతకైనా వెళ్తారు. మోడీని నిన్నటి వరకూ తిట్టిన బాబే ఇపుడు ఒక్క మాట అనడంలేదు. పైగా ఆయన నమ్మిన బంట్లు అయిన టీడీపీ ఎంపీలు ఇపుడు బీజేపీ అధికార సభ్యులైపోయారు.


ఈ పరిణామాల నేపధ్యంలో బాబుకు కేంద్రం అండ బాగా దొరుకుతోందని అంటున్నారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల విషయంలో సమీక్షలు వద్దంటూ ఏకంగా కేంద్ర ఇంధన శాఖ మంత్రి ముఖ్యమంత్రి జగన్ కి లేఖ రాయడం ఇపుడు చర్చగా ఉంది. పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లుగా ఆధారాలు ఉన్న ఈ కుంభకోణం వెలుగులోకి వస్తే బాబు చిక్కుల్లో పడతారు. ఇపుడు కేంద్రం లేఖ బాబుకు వూరటగా మారింది.


అదే విధంగా పోలవరం విషయంలో ఎటువంటి అవినీతి జరగలేదని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజెంద్రనాధ్ షెకావత్ పార్లమెంట్ సాక్షిగా చెప్పుకొచ్చారు. ఓ విధంగా ఇది కూడా చంద్రబాబుకు కొండంత అండగానే భావించాలి. ఈ పరిణామాలు చూస్తూంటే కేంద్రంలో బాబు పలుకుబడి అమాంతం పెరిపోతోందనిపిస్తోంది. అదే సమయంలో గట్టిగా రెండు నెలలు కాకుండానే మోడీ జగన్ మీద బాణాలు దూస్తున్నారా అన్న సందేహాలూ కలుగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: