ఏదో ఒక విధంగా అసెంబ్లీ సమావేశాలల్లో రాద్దాంతం చేయాలనే తెలుగుదేశంపార్టీ నిర్ణయించుకున్నట్లే కనిపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే ప్లాన్ చేసుకునే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నట్లు అర్ధమైపోతంది. బుధవారం అసెంబ్లీ జరిగిన వ్యవహారమే ఇందుకు తాజా ఉదాహరణ.

 

ప్రశ్నోత్తరాల సమయంలో ఏ సభ్యుడైతే ప్రశ్న వేస్తారో మంత్రి సమాధానం చెప్పిన తర్వాత ముందుగా మాట్లాడే అవకాశం ప్రశ్నవేసిన సభ్యుడికే దక్కుతుంది. తర్వాత ఇంకోరు కూడా మాట్లాడాలని అనుకుంటే అనుమతించటం స్పీకర్ ఇష్టం. ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నా జరిగేదిదే. కానీ అందుకు విరుద్ధంగా చంద్రబాబునాయుడు అండ్ కో పట్టుపట్టారు.

 

ప్రశ్న ఎవరు వేసినా, ఎంతమంది మాట్లాడదలచుకున్నా అందరికీ అవకాశం ఇవ్వాల్సిందే అన్నట్లుగా చంద్రబాబు స్పీకర్ తో వాదన పెట్టుకున్నారు. సభా నియమాలను చదివి వినిపించినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఇదే విషయమై దాదాపు గంటసేపు సభా సమయం వృధా అయ్యింది. అదే విధంగా చంద్రబాబు పక్కన ఎవరు కూర్చోవాలనే విషయం మీద కూడా సభా సమయాన్ని టిడిపి బాగా వృధా చేసింది.

 

అసెంబ్లీలో ఎవరు ఎక్కడ కూర్చోవాలన్న విషయాన్ని నిబంధనలను పరిశీలించి స్పీకర్ నిర్ణయిస్తారు. దాని ప్రకారం చంద్రబాబు పక్కన బుచ్చయ్య చౌదరి కూర్చోవాలని డిసైడ్ చేశారు. అయితే తన పక్కన అచ్చెన్నాయుడును కూర్చో పెట్టుకుంటానని చంద్రబాబు అన్నారు. దాంతో అనవసరమైన రబస జరిగింది. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే అధికారంలో ఉన్నపుడు నిబంధనలకు పాతరేసిన చంద్రబాబు ఇపుడు కూడా తనిష్ట  ప్రకారమే అసెంబ్లీ జరగాలని పట్టుబడుతుండటమే విచిత్రంగా ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: