ఏపీ రాజకీయాల్లో బీజేపీ ఆశ అమాంతం పెరిగిపోయింది. ఎంతలా అంటే ఒక్క అసెంబ్లీ సీటు లేదు, నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అయినా తామే 2024 నాటికి ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. వీలైతే నేడో రేపో ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషిస్తామని కూడా అంటున్నారు. మరి బీజేపీకి ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వస్తోంది.


బీజేపీ బాట ఇపుడు అచ్చమైన కాంగ్రెస్ బాట. తమ వారిని గవర్నర్లుగా నియమించుకుని ప్రతిపక్ష పార్టీల రాష్ట్రాల్లో అలజడి రేపడం నాటి కాంగ్రెస్, నేటి బీజేపీ రెండింటికీ అలవాటే, ఈ నేపధ్యంలో నుంచి చూసినపుడు 85 ఏళ్ల రాజకీయ కురువ్రుధ్ధుడు బిశ్వ  భూషన్ హరిచందన్ ఏపీకి కొత్త గవర్నర్ గా  ఏ రకమైన సంచలనాలు నమోదు చేస్తారోనన్న చర్చ సాగుతోంది.


ఇప్పటివరకూ ఉమ్మడి ఏపీకి గవర్నర్ గా వ్యవహరినిన నరసిమ్హన్ మాజీ బ్యూరోక్రాట్. అందువల్ల ఆయన రాజకీయాల్లో వేలు కాలు ఎక్కడా పెట్టలేదు, అయితే కొత్త గవర్నర్ రాజకీయాల్లో తల పండినవాడు, పక్కా ఆరెసెస్ మనిషి. మరి రాజ్ భవన్ అండ ఏపీ బీజేపీకి ఇపుడు దొరికినట్లే. మరో వైపు జగన్ సర్కార్ మీద కచ్చితంగా చెక్ ఉంటుందని కూడా చెప్పాల్సి ఉంటుంది, మొత్తానికి గవర్నర్ నియామకం వెనక బీజేపీ మహా మంత్రాంగం ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: