జగన్ సీఎం కావడం చంద్రబాబు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు అసెంబ్లీలో బాబు పడే ఆవేదన అదే కదా. తన సీటు జగన్ లాగేసుకున్నాడన్న బాధ ఆయనలో అడుగడుగునా కనిపిస్తోంది. సీనియర్ మోస్ట్ లీడర్ అని చెప్పుకునే బాబు అసెంబ్లీలో హుందాతనాన్ని మరచిపోతున్నారన్న కామెంట్స్ వస్తున్నాయి.


ఇదిలా ఉండగా జగన్ని బయట  మీడియా సమావేశాల్లో   బాబు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. అవి శ్రుతి మించుతున్నాయి కూడా. తాజాగా  ముఖ్యమంత్రి జగన్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్య చేశారు. పులివెందుల తరహాలో పంచాయతీలు చేసి ప్రభుత్వ పాలన సాగించాలని చూస్తున్నారని అది కుదరదని ఆయన హెచ్చరించారు. 


ఇలా  బెదిరింపులకు దిగడం, దౌర్జన్యాలకు పాల్పడటం వంటి పంచాయితీలు పులివెందులలో కుదురుతాయేమోగానీ అమరావతి, ఇతర ప్రాంతాల్లో కుదరవన్నారు. అసెంబ్లీలోనూ సీఎం జగన్ పులివెందుల పంచాయితీల తరహాలోనే వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.   నిజంగా చంద్రబాబు లాంటి నాయకుడు నోటి వెంట  ఇలాంటి మాటలు రావచ్చా. ఆయన ఉమ్మడి ఏపీకి సీఎం గా చేశారు. ప్రాంతాలను రెచ్చగొట్టడం, అవమానించడం ఆయన స్థాయికి తగునా అన్న చర్చ నడుస్తోంది. 


ఇలాంటి మాటలు అనడం ద్వారా ఆ ప్రాంత ప్రజలను అవమానిస్తున్నానన్న సంగతిని కూడా బాబు  మర్చిపోతున్నారు. ఎన్నికల్లో ఓటమి తరువాత కూడా బాబు  ఇలాగే వ్యహరించడం వల్ల మరింతగా పలుచన అవుతారన్నది నిజమంటున్నారు మేధావులు.


మరింత సమాచారం తెలుసుకోండి: