వైఎస్ జగన్ సీఎం గా ప్రమాణం చేసిన తరువాత బాగా బిజీ అయ్యారు. ఆయన తొలి జిల్లా పర్యటనగా కడపను ఎంచుకున్నారు. ఆ తరువాత ఆయన మళ్ళీ ఎక్కడా అధికారిక పర్యటనలు పెట్టుకోలేదు. ఇక విశాఖలో జగన్ టూర్ ఎపుడా అని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


అయితే విశాఖలో అద్భుతమైన ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించాలని వైసీపీ సర్కార్ నిర్ణయించింది. ఈసారి ఆగస్ట్ 15 వేడుకలను విశాఖ వేదిక జరపనున్నారు. దీనికి సంబంధించి వేదికగా ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ ని ఎంపిక చేస్తున్నారు. జగన్ సీఎం హోదాలో ఇక్కడ తొలి సారిగా జాతీయ జెండా ఆవిష్కరిస్తారు.


ఇదిలా ఉండగా గత ఏడాది జగన్ ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తూ విశాఖలో ప్రవేశించారు.  ఆ రోజు ఆయన విశాఖ జిల్లా నర్శీపట్నంలో విపక్ష నేతగా ఆగస్ట్ 15 వేడుకల్లో పాల్గొన్నారు. ఏడాది తరువాత ఇపుడు ముఖ్యమంత్రి హోదాలో జగన్ విశాఖ నగరం నడిబొడ్డున జాతీయ జెండాను ఎగురవేయడం విశేషంగానే చెప్పుకోవాలి. 


ఇక అంతకుము నుందు అంటే 2015లో అప్పటి సీఎం చంద్రబాబు విశాఖలో ఆగస్ట్ 15 వేడుకలను నిర్వహించారు. విశాఖ బీచ్ రోడ్ లో ఈ వేడుకలు జరిగాయి. ఇక గత ఏడాది చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో స్వాతంత్ర దినోత్వ వేడుకలు నిర్వహించారు. ఇపుడు జగన్ విశాఖ నిర్వహించడంతో ఉత్తరాంధ్ర, విశాఖ ప్రాముఖ్యత  ప్రభుత్వ పరంగా  బాగా చాటిచెప్పినట్లవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: