ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకుంటే మంచిదని బీజేపీ సీనియర్ నేత పురందేశ్వరి వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగినా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఏపీ 'సీఎం'పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 


విశాఖపట్నం జిల్లాలో వైఎస్ జగన్ కేవలం చర్చిలకు మాత్రమే భద్రత కల్పిస్తూ పోలీస్ కమిషనర్ ఆదేశాలు ఇవ్వడం సరికాదని, ఒక మతాన్నో, కులాన్నో కావాలని ప్రోత్సహించేలా వ్యవహరించడం సమాజంలో గొడవలకు దారితీస్తుందని హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన తప్పే మీరు చేస్తున్నారు, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, మీరు పద్దతి మార్చుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు.  


అయితే ఇదే సందర్భంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన పురందేశ్వరి, ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వడం సాధ్యం కాదని, కేవలం ప్యాకేజి మాత్రమే ఇవ్వగలదని పురందేశ్వరి స్పష్టం చేశారు. మరి పురందేశ్వరి చేసిన ఈ వ్యాఖ్యలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: